
మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కూడా మరో నాలుగైదు రోజుల్లో అమలు కానుంది. రాష్ట్రంలోని రైతుల ఖాతాలలో 7000 రూపాయల నగదు జమ కానుంది. పీఎం కిసాన్ స్కీమ్ కు అర్హత పొందిన రైతులు ఈ స్కీమ్ ప్రయోజనాలను సైతం పొందనున్నారని తెలుస్తోంది. ఈ రెండు పథకాల అమలుతో టీడీపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. రాష్ట్రంలో సంక్షేమం విషయంలో టీడీపీకి తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆగస్టు నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను సైతం కూటమి సర్కార్ అమలు చేయనుంది. పెద్దగా నిబంధనలు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తే మాత్రం కూటమి సర్కార్ కు ఎంతో బెనిఫిట్ కలగనుంది. ఈ స్కీమ్ సైతం అమలైతే సూపర్ సిక్స్ హామీలలో మెజారిటీ హామీలను అమలు చేసినట్టు అవుతుంది. కూటమి సర్కార్ వలంటీర్ల సపోర్ట్ అవసరం లేకుండానే సంక్షేమ పథకాల అమలు దిశగా అడుగులు వేస్తోంది.
ఎక్కువ సంఖ్యలో ప్రజలు పథకాల ప్రయోజనాలు పొందే విధంగా కూటమి సర్కార్ నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు లాంటి పథకాలను అమలు చేస్తున్న ఏపీ సర్కార్ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఊహించని స్థాయిలో మేలు చేస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వచ్ఛే నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి సైతం జరిగితే 2029 ఎన్నికల్లో సైతం కూటమి సర్కార్ కు తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు.