- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న మంత్రులలో కొందరు మంత్రులు బ్యాక్ బెంచ్ మినిస్టర్లుగా మిగిలిపోయారని .. వీరి పని తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పక్కన పెడితే మిగిలిన మంత్రులలో బిజెపి నుంచి సత్య కుమార్ యాదవ్ , జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉంటే మిగిలిన వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే మంత్రులుగా ఉన్నారు. అనేక వడ‌పోతలు  .. సామాజిక వర్గాల సమీకరణలు , ప్రాంతీయ నేపథ్యం పరిగణలోకి తీసుకుని చంద్రబాబు వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎంతోమంది నాయకులు మంత్రి పదవులు ఆశించినా .. ఎంతోమంది సీనియర్లు మంత్రి పదవి కావాలని కోరిన వారిని పక్కన పెట్టి ఏరి కోరి యువ నాయకులను తొలిసారి ఎమ్మెల్యేలు గెలిచిన వారిని కూడా తన టీం లోకి చేసుకున్నారు.


వీరంతా దూకుడుగా పని చేస్తారని మంత్రులుగా మంచి పేరు తెచ్చుకునే ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారని చంద్రబాబు భావించారు. అయితే చాలామంది మంత్రులు దీనిని ఓ పార్ట్ టైం ఉద్యోగంగా భావిస్తున్నారని స్వయంగా చెబుతున్నారు. వాస్తవానికి మంత్రి అంటే పర్మినెంట్ ఎంప్లాయ్ కాదు .. అధికార పార్టీ విధివిధానాలు ప్రజలకు చేరువ అయ్యేలా .. తమకు అప్పగించిన శాఖను ప్రజలకు దగ్గర చేసేలా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలి. అలాగే ప్రత్యర్ధులపై ఎప్పటికప్పుడు విమర్శలతో విరుచుకు ప‌డుతూ ఉండాలి. ఈ విషయంలో 6 నుంచి 8 మంది టీడీపీ మంత్రులు వెనకబడుతున్నారని చంద్రబాబు చెబుతున్నారు.


కొల్లు రవీంద్ర - మండిపల్లి శ్రీనివాస్ రెడ్డి - బీసీ జనార్దన్ రెడ్డి - కొలుసు పార్థసారథి - మహమ్మద్ ఫరూక్ - సబిత వంటి వారు తొలి వరుసలో ఉన్నారని టాక్ ? పనితీరు ఆధారంగా వీరికి యావరేజ్ మార్కుల ఉన్న ప్రత్యర్థులను అరి కట్టడంలో వేరకడుతున్నారని .. బలమైన రాజకీయాలు చేయలేకపోతున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరి మార్పులు చేర్పుల‌లో వీరిలో ఎవరి మీద అయినా వేటు పడుతుందా ?లేదా అన్నది చంద్రబాబు విచక్షణ మేరకు ఆధారపడి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: