
బీజింగ్ లో జరిగిన 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్ కార్యక్రమంలో చైనా సరికొత్తగా రూపొందించిన మ్యాగ్లేవ్ రైలుని చైనా ప్రదర్శించింది.అయితే ఈ ట్రైన్ కేవలం 7 సెకండ్లలోని 600 కిలోమీటర్ల వేగాన్ని సైతం అందుకుంటుందని అక్కడ అధికారులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ ఈ ట్రైన్ కూడా అందుబాటులోకి వస్తే.. బీజింగ్ నుంచి షాంగై ఉండేటువంటి 1200 కిలోమీటర్ల దూరంలో కేవలం 150 నిమిషాలలోనే చేరుకోగలరు. అయితే ప్రస్తుతం ఈ ప్రయాణానికి అవుతున్న సమయం 5:30 నిమిషాలట. మ్యాగ్నెటిక్ లివిటేషన్ టెక్నాలజీ తో నడిచేటువంటి ట్రైన్ విమానాల వేగంతో పోటీ పడుతుంది.
ఈ సాకేతికం వల్ల వ్యతిరేక అయస్కాంతాలకు క్షేత్రాలను సైతం ఉపయోగించుకొని మరి ట్రాక్ నుంచి రైలు పైకి లేపడానికి చాలా సులువుగా ఉపయోగపడుతుందట. దీనివల్ల ఫిక్షన్స్ తగ్గి రైలు నిశ్శబ్దంగా వేగంగా వెళ్లడానికి ఉపయోగపడుతుందని బీజింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ ఈ ట్రైన్ కనుక వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యధికంగా వెళ్లే వాణిజరైలుగా పేరు సంపాదిస్తుందని చెబుతున్నారు. ఏడాది జూన్లో దీనిని పరీక్షించారని ఈ రైలు యొక్క బరువు సుమారుగా 1.1 టన్నులు ఉన్నదని చూడడానికి నాజూగ్గా బుల్లెట్ షేపులో కనిపిస్తోంది. ప్రస్తుతం చైనాలోని ఈ హై స్పీడ్ రైల్వే వ్యవస్థను గత ఏడాది చివరికి 48 వేల కిలోమీటర్లను విస్తరింప చేయగా ఇప్పుడు దీన్ని 50 వేల కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంతో వెళ్తున్నారు. CR -450 బుల్లెట్ ట్రైన్లను ఆవిష్కరించారు.. ఇది గంటకు 450 కిలోమీటర్లు గరిష్ట వేగంతో వెళ్తుంది.