
విజయసాయిరెడ్డి మొదట్లో ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు ఆధారాలు ఉన్నా, తర్వాత ఈ వ్యవహారానికి రాజ్ కే.సి. రెడ్డిని పెట్టారని తెలుస్తోంది. అందుకే విజయసాయి అసహనం వ్యక్తం చేస్తూ, “అంతా ఆయనే చేశాడు” అంటూ వ్యవహారం మొత్తాన్ని రాజ్ మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విజయసాయికి కూడా కోట్ల రూపాయల లాభం వచ్చినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అదీ మామూలు డబ్బు కాదు, అరబిందో ఫార్మా ఖాతాల్లోకి వెళ్లిన డబ్బు. విజయసాయి మాత్రం “అది అప్పు.. తిరిగి ఇచ్చేశాం” అనే బుధ్ధిమంతుల కథ చెబుతున్నారట. కానీ ఈ కథనాన్ని నమ్మే స్థితిలో సిట్ లేదు. అసలు ఈ వ్యవహారాన్ని పూర్తిగా పరిశీలించాలంటే విజయసాయి చేతులెంతో ఉన్నాయి. అందుకే సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఇప్పట్లో విచారణకు హాజరయ్యే ఉద్దేశం లేనట్టు తెలుస్తోంది.
ఇటీవల విజయసాయిరెడ్డి "కర్మ సిద్ధాంతం"పై చేసిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిజంగానే ఆయన కర్మ మీద నమ్మకం ఉంటే, తాను చేసిన దోపిడీకి, తప్పుడు వ్యవహారాలకు ఫలితం తప్పదని అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం తప్పుడు మార్గాల ద్వారా తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కర్మను నమ్మేవాడైతే తప్పు చేసిన దారి నుంచి వెనక్కి తిరిగి రావాలి. కానీ విజయసాయి తీరు చూస్తే.. కేసు నుంచి బయట పడేందుకు ప్రణాళికలు వేసే యత్నమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే – సిట్ చేతుల్లో ఉన్న ఆధారాలు ఎంత బలంగా ఉన్నాయన్నది. ఈ స్కాంలో నిజంగా జగన్ రెడ్డి ప్రమేయం ఉందా ? విజయసాయిరెడ్డి పాత్ర ఎంతటి వరకు వెళ్లిందన్నది సమాధానం దొరికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.