
ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ నేతలు మద్యపాన నిషేధం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంలో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కల్తీ మద్యం వల్ల చాలామంది బతుకుల్ని నాశనం చేశారంటూ తెలిపారు. వైసిపి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కేసులు ఒక్కసారిగా పెరగడానికి ముఖ్య కారణం ఈ కల్తీ మధ్యమే అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడడం జరిగింది.
వైసీపీ నేతలు బెదిరించడం, దబాయించడం అలవాటుగా మారిపోయింది. ఇలా చేస్తే భయపడతారు అనుకుంటున్నారేమో.. వ్యవస్థలను రక్షించే వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారని గుర్తుపెట్టుకోవాలంటు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు పరిపాలన పైన శ్రద్ధ లేదు సినిమాల మీదే శ్రద్ధ అంటూ వైసిపి నాయకులు విమర్శలు చేయడంతో ఫైర్ అయ్యారు.. ఈ విషయంపై మాట్లాడుతూ వాళ్ళు మాత్రం పత్రికలు, టీవీలు, బినామీ కంపెనీలతో వ్యాపారాలు చేస్తూ ఆదాయాలు సంపాదిస్తున్నారు.. తాను సినిమాలు మానేయాలా? వారు సిమెంట్ ఫ్యాక్టరీలు ఇతర వ్యాపారాలను మూసివేయమనండి అంటూ ఫైర్ అయ్యారు.. తాను కేవలం సినిమా షూటింగ్లోకి వెళ్లడమే కనిపిస్తోంది తప్ప వారు చేసేది కనిపించదా అంటూ ఫైర్ అయ్యారు.
సినిమా షూటింగ్ కోసం..
రాజకీయాలు ,సినిమాలు ఎన్నికల ముందు అసలు బ్యాలెన్స్ చేయలేకపోయానని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల వరకు తనకు సమయమే దొరకలేదని అప్పగించిన బాధ్యతల పైన అవగాహన పెంచుకోవడానికి సమయం సరిపోయేదని.. అలాంటి సమయంలో రెండు గంటల సమయం మాత్రమే షూటింగ్ కు కేటాయించాలని తెలిపారు.
టికెట్ల ధరలపై..
గతంలో భీమ్లా నాయక్ సినిమా టికెట్ల ధరలను వైసీపీ ప్రభుత్వం పెంచడానికి అనుమతి ఇవ్వలేదు.. అప్పుడు తాను కూడా అడగలేదని కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలని తెలిపారు. అందరి సినిమాలకు ఎలాంటి ప్రాసెస్ జరిగిందో అలాంటి ప్రాసెస్ తన సినిమాకు కూడా జరిగిందని తెలిపారు. ఇక ఆగస్టు 15 తర్వాత జనసేన పార్టీని ప్రజలలోకి బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.