ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తమ మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు పొందుతోంది. అయితే తాజాగా సాక్షి పత్రికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య అస్తవ్యస్తమైందంటూ ఒక కథనం ప్రచురితం కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ఖాళీ అంటూ ప్రచురితమైన ఈ కథనం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.  రాష్ట్రంలోని 475 కాలేజీలలో సగానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్ కే  పరిమితమైన కాలేజీలు 200కు పైగా ఉన్నాయని తెలుస్తోంది.  గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని సమాచారం అందుతోంది.

కూటమి సర్కార్ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.  తల్లికి వందనం పథకాన్ని సైతం గతేడాది అమలు చేయకుండా ఈ ఏడాది అరకొరగా ఏపీ సర్కార్ అమలు చేసిందని  సోషల్ మీడియా వేదికగా  కామెంట్లు వినిపిస్తున్నాయి.  డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఆరు త్రైమాసికాల ఫీజు బకాయి ఉందని  ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి విద్యార్థులు ప్రయివేట్ బాట పడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చేరిన విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉందని  సమాచారం అందుతోంది.

సాక్షి పత్రిక కథనం గురించి కూటమి సర్కార్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.  ప్రభుత్వ కాలేజీలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా  ఈ వివాదంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకోవడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: