ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి కేంద్రం  మంచి సపోర్ట్ అందుతోంది. ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకోవాలన్నా ఫండ్ రిలీజ్ చేసి  అభివృద్ధి బాట లో వెళ్లేందుకు సహకారం అందిస్తోంది. ఇదిలా నడుస్తున్న తరుణం లో  కూటమి ప్రభుత్వం మరొక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాం లో అసంబద్ధంగా జిల్లాల విభజన వివాదాలకు దారితీసింది. దీనిని పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కమిటీ ని కూడా నిర్ణయించింది. ఇందులో ముఖ్యంగా జిల్లాల పేర్లలో మార్పులు, నియోజకవర్గాలను పొరుగు జిల్లాల్లో విలీనం చేయడానికి ప్రతిపాదనలు వంటి వాటిపై చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

జిల్లాల యొక్క సరిహద్దులు  చట్టపరమైన అంశాలు, నియంత్రణ,సాంకేతికత వంటి అంశాలను పరిశీలించడానికి నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు పూర్తిస్థాయిలో రాష్ట్రమంతా తిరిగి అన్ని పరిశీలించి రిపోర్టు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీలో కనీసం 26 నుంచి మొదలు 30 జిల్లాల వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా రాజంపేట, మార్కాపురం, హిందూపురం, వంటి వాటిని జిల్లాలు చేయాలని ప్రజలు ఎప్పటినుంచో అడుగుతున్నారు. 

ఇందులో కొన్ని జిల్లాలకు పేర్ల మార్పు డిమాండ్ కూడా ఉంది.. ముఖ్యంగా గతంలో ఏర్పాటు చేసిన చాలా జిల్లాల్లో ప్రధాన కార్యాలయాలలకు దూరంగా ఉన్నాయి. ఒక్కో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కొంతమంది ప్రజలకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. అలాంటి ప్రాంతాలను గుర్తించి వారికి అందుబాటులో జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వీటిపై పూర్తి సమాచారం రావాలి అంటే నివేదిక వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం లో కూడా కొత్త నియోజకవర్గాల విభజన కొత్త జిల్లాల కోసం ప్రజల ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: