
అయితే 12 జిల్లాలతో ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఈ డిమాండ్ ఆచరణ సాధ్యమవుతుందని చెప్పలేం కానీ రాయలసీమకు ఇదే విధంగా అన్యాయం కొనసాగితే భవిష్యత్తులో ప్రత్యేక రాయలసీమ దిశగా అడుగులు పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
రాయలసీమ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి నుంచి ఈ డిమాండ్ వ్యక్తమైంది. నరేంద్ర మోడీకి సైతం ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు ప్రత్యేక రాయలసీమ డిమాండ్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పార్టీలు మద్దతు ఇవ్వకపోతే పోరాటాలు చేసైనా సాధించుకుంటామని ఆయన అన్నారు.
ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంద్ర విడిపోయిన సమయంలో రాయలసీమలో 12 జిల్లాలు ఉండేవని ప్రస్తుతం అవే జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ కావాలని ఆయన కోరారు. ప్రత్యేక రాయలసీమకు మద్దతు కోసం ఇతర ప్రాంతాలలో పర్యటిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. 2029 సంవత్సరంగా ప్రత్యేక రాయలసీమను ప్రకటించాలని ఆయన కోరారు. మరి ఆయన డిమాండ్ల విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు+