
ఎన్నికల ముందు సమయంలో సహజంగానే ఇతర పార్టీలలో నుంచి నేతలు బయటికి వస్తూ ఉంటారు. మరి కొంతమంది టికెట్టు దక్కదని భావించి ఇతర పార్టీ వైపు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ లేదా జనసేన లేకపోతే వైసిపి తప్ప మరే పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నం చేయరు నేతలు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కనుమరుగయ్యింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చే సీనియర్ నేతలను వైసీపీ పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదంతా కూడా జిల్లాల పర్యటనలో భాగంగా జగన్ చేర్చుకునే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయట. ఇప్పటికి ఎన్నోసార్లు జరిగిన సమావేశాలలో నేతలకు పార్టీకి ఉపయోగపడే వారిని చేర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించాలని ఎవరైతే పార్టీలో చేరితే బలం చేకూరుతుందని భావిస్తే వారిని చేర్చుకొనే అవకాశాల పైన పరిశీలించాలని తెలియజేశారట. అటువంటి నేతల జాబితాను కూడా తయారు చేయాలి అంటూ ఇటీవలే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమైనట్లుగా సమాచారం.
కానీ పార్టీని వీడి ఇతర పార్టీలలోకి వెళ్లిన నేతలను మాత్రం చేర్చుకోవడానికి జగన్ మనసు మార్చుకోలేదని నేతలు తెలియజేస్తున్నారు. గతంలో నియోజకవర్గాలలో నేతలు తాను ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా వారు పార్టీ కష్ట కాలంలో ఉంటే పార్టీని వదిలేసి వెళ్లిపోయారని దీంతో కేవలం కొంతమంది సీనియర్ నేతలను మాత్రమే చేర్చుకునే విషయంలో పునరాలోచించాలని పలువురు సీనియర్ నేతలు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జగన్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో జిల్లాల పర్యటన చేస్తున్న సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు , ఎలాంటి పనులు చేస్తారనే విషయంపై కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.