టెక్నాలజీ పెరిగింది.. మనుషుల మధ్య అనుబంధాలు తగ్గుతూ దేశాల మధ్య బంధాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఇండియా కు ఇతర దేశాల తో మైత్రి తక్కువగా ఉండేది. ఆ మైత్రి పెరిగి పోయింది. మన ఇండియా అభివృద్ధి లో దూసుకుపోతున్న తరుణం లో ఇతర దేశాలు కూడా ఇండియా లో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అంతే కాదు ఇండియా కూడా  పది అగ్ర దేశాల్లో ఒకటిగా మారిపోయింది. ఇదంతా ఇలా నడుస్తున్న తరుణం లో  ఎప్పుడు ప్రపంచ దేశాల పై అజమాయిషీ చెలాయించాలని చూసే అమెరికా కు ప్రియారిటి తక్కువ అవుతుంది. 

ఇదే తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని దేశాలు నేను చెప్పినట్టే వినాలనే విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారు. అంతే కాదు ట్రంప్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమెరికా కు సంక్షోభం వస్తే ప్రపంచ పు రూపు రేఖలు మారిపోతాయన్నారు. ప్రపంచం లోని  వివిధ దేశాలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంపు నిర్ణయాల వల్ల అన్ని  కూటములు  మారిపోతున్నాయి. చైనీస్ ఫారెన్ మినిస్టర్ నెక్స్ట్ వీక్ ఇండియా కు రాబోతున్నారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ రష్యన్ విదేశాంగ మంత్రి తో భేటీ కావడానికి సిద్ధమయ్యారు.

 బ్రిక్స్ లీడర్స్ అంతా కలిసి అమెరికా ప్రెజర్ ను తట్టుకునేందుకు ఆల్టర్నేట్ ప్లాట్ఫార్మ్స్ చూసుకోబోతున్నారు. అమెరికాపై ఆధారపడకుండా అన్ని విధాలుగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా రష్యాతో డాలర్స్ తో కాకుండా రూబెల్స్ బిజినెస్, చైనా యువాన్స్ తో బిజినెస్ చేయడానికి ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇలా ప్రపంచ దేశాలు అన్నింటిని ట్రంప్ సుంకాలు ఇతర  వాటి పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ కలిపి అమెరికాకు వ్యతిరేకంగా అభివృద్ధి చెందేందుకు ముందుకు వెళుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: