ప్రస్తుతం సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కవిత వ్యవహారమే వినిపిస్తోంది. ఎప్పుడైతే ఆమె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందో అప్పటి నుంచే కేసీఆర్ ఫ్యామిలీతో విభేదాలు ఏర్పడుతున్నాయి.. అప్పటినుంచి ఆమె  ఎప్పుడెప్పుడు ఆ ఫ్యామిలీ గురించి నిజాలు బయట పెట్టాలా, తన తండ్రికి నిజాలు చెప్పాలా అని ఎదురు చూసింది. ముందుగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆయనను ఎప్పుడో ముంచేస్తాయని  చెప్పుకొచ్చింది. ముఖ్యంగా దయ్యాల రూపంలో తన అన్న కేటీఆర్ ను వర్ణించింది. ఆ తర్వాత కొన్ని నెలలకు మళ్లీ మీడియా సమావేశం పెట్టి హరీష్ రావు, సంతోష్ రావు మంచివాళ్లు కాదని , వాళ్లు కేసీఆర్ పై మరక వేయాలని చూస్తున్నారని అన్నది. కేసీఆర్ దేవుడు అంటూ వర్ణించింది.. కానీ కవిత వేసిన ప్లాన్ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు.. 

ఆమె మాటలకు కనీసం ఎవరు కూడా ఆదరణ ఇవ్వలేదు. చివరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. ఆ విధంగా  కవిత తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి చేసినట్టు, తాను హరీష్ రావును, సంతోష్ రావును  కేసీఆర్ కు దూరం చేయాలనుకుంది. చివరికి తానే దూరమైపోయింది. అంతేకాదు కవిత చేసిన పనికి పార్టీలో నాయకులకు మరో క్లారిటీ కూడా వచ్చింది. ఈ పని చేయడం వల్ల కవితకు కనీసం ఏ నాయకుడి నుంచి కూడా ఆదరణ లభించలేదు. ముఖ్యంగా కవిత వెంబడి ఇన్నాళ్లు నడిచినటువంటి ముఖ్య నాయకులు కూడా ఆమె వెంబడి ఉండమని, మేము కేసీఆర్ వెంటే నడుస్తామని చెప్పుకొచ్చారు. ఇదే తరుణంలో చాలామంది నాయకులు హరీష్ రావుకు సపోర్టుగా నిలుస్తూ  కవితను  నిందిస్తూ వచ్చారు.

ఆమె ఈ విధంగా హరీష్ రావును తప్పుడు మాటలతో ఇబ్బంది పెట్టాలనుకుంటే హరీష్ రావుకు మరింత ఇమేజ్ పెరగడమే కాకుండా పార్టీలో ఆయన బలమేంటో బయటపడిపోయింది. ఒకవేళ హరీష్ రావు కవిత మాటలను పట్టుకొని  పార్టీ నుంచి బయటకు వెళ్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోతుంది. ఆ విధంగా తన బలమేంటో కవిత ద్వారానే బయటి జనాలకు మరింత తెలిసిపోయిందని అంటున్నారు. ఇలా కవిత హరీష్ రావును దొంగ చేయాలనుకుంటే చివరికి ఆ  వ్యవహారమంతా ఆమెకి ఒక పెద్ద వాయుగుండంలా చుట్టుకుంది. మరి చూడాలి ఈ వ్యవహారంలో కవిత ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: