
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో అన్ని పార్టీలు ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో అన్ని కులాల వారు ఉన్నారు. అయితే ఇక్కడ పొలిటికల్ పరంగా కూడా ఎక్కువగా కమ్మ సామాజిక వర్గమే ఉంటుంది. వీరి ఓట్లు ఎక్కువ. వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన వారే 80 శాతం వరకు ఉన్నారు. అలాగే ముస్లిమ్స్, బీసీ, యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ను బరిలోకి దించాలనుకుంటున్నారు.. దాదాపుగా ఆయనని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. నవీన్ యాదవ్ ఎవరో కాదు శ్రీశైలం యాదవ్ గారి కుమారుడే.. ఈయనకు కూడా మంచి పేరు ఉంది. 2009 లో టీడీపీ నుంచి చంద్రబాబు కూడా ఈయనకు సీటు ఇవ్వాలనుకున్నారట. కొన్ని కారణాల చేత ఇవ్వలేకపోయారు.
ఇక నవీన్ యాదవ్ కు కూడా పార్టీలో మంచి పేరు ఉంది. ఎన్నికల కోసం నవీన్ యాదవ్ గత కొన్ని నెలలుగా పని చేస్తూనే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను ఫిక్స్ చేసింది. బిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించారు కాబట్టి ఆయన తమ్ముడు మాగంటి వజ్రనాథ్ సీటు ఆశిస్తున్నారు. అలాగే గోపీనాథ్ భార్య కూడా సీటు ఆశించడంతో వీరిద్దరిలో ఎవరో ఒకరికి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. గోపీనాథ్ సోదరుడు మాత్రం అన్నిట్లో యాక్టివ్గానే కనిపిస్తున్నారు. అయితే బిఆర్ఎస్ పార్టీ మాత్రం గోపీనాథ్ భార్యకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక బిజెపి పార్టీ మాత్రం గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన దీపక్ రెడ్డికే సీట్ ఇచ్చే అవకాశం ఉన్నది.
ఇక అభ్యర్థుల విషయంలో కూడా క్లారిటీ ఉంది.. గెలుపోటములు విషయం మీద చర్చ విషయానికి వస్తే.. గ్రౌండ్ లెవెల్ లో బిఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్.. 2014,2018 ,2023 లో కూడా గోపీనాథ్ 15 వేల ఓట్లకు పైగా తేడాతో గెలిచారు. అంతల గోపీనాథ్ గారు పేరు సంపాదించారు. టిడిపి నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినప్పటికీ కూడా టిడిపి వాళ్ళు శత్రువుగా చూడలేదు. తమ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటూ ప్రజలకు కూడా దగ్గరయ్యారు. టిడిపి అక్కడ స్ట్రాంగ్ గా ఉండడంతో ఆ పునాదులే బిఆర్ఎస్ గా మారింది. ఇన్ని రోజులు టిడిపి, బిఆర్ఎస్ వారు గోపినాథ్ కి అండగా ఉన్నారు.
అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో పార్టీ పరంగా క్యాడర్ పరంగా కూడా నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి..ఆయన గెలుస్తారని అటు బెట్టింగ్స్, మౌత్ టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. బిజెపి పార్టీ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. బిజెపి పార్టీకి( జనసేన+ టిడిపి) పొత్తు ఏపీలో కూడా ఉంది. ఇదే పొత్తు జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఉపయోగించుకుంటే అక్కడ రాజకీయాలు మారిపోతాయి. ముఖ్యంగా ఆంధ్ర నుంచి అక్కడ సెటిలైన వారు ఎక్కువ మంది ఉన్నారు. జనసేన పార్టీ, టిడిపి పార్టీ సానుభూతిపరులు ఎక్కువగానే ఉన్నారు. అందువల్లే అక్కడ వీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ పొత్తు విషయంలో బిజెపికి సపోర్టు చేస్తే కాంగ్రెస్ కు గట్టి పోటీ అని చెప్పవచ్చు. ఇక బిఆర్ఎస్ పార్టీ కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయట. కాబట్టి ఇన్ డైరెక్ట్ గా బిజెపి పార్టీకే సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి.