ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దిశను మార్చిన కొన్ని చారిత్రక క్షణాలు జనాలు అంత ఈజీగా మర్చిపోలేరు. అలాంటి క్షణాలను శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేసిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి, 2024 ఎన్నికల ఫలితాన్ని పూర్తిగా ప్రభావితం చేసిన చారిత్రాత్మక చిత్రం. ఈ ఫోటోలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ని మనం చూడచ్చు. 2023 సెప్టెంబర్ 9న,  జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పదమైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఛీడ్ అధికారులు హడావుడిగా నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశారు.


ఆ సమయంలో, న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలో తీసిన చంద్రబాబు నాయుడు యొక్క ఒక ఎమోషనల్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారింది. కుర్చీలో కూర్చొని బయటకు చూసుకుంటూ ఉన్న చంద్రబాబు యొక్క ఆ భావోద్వేగభరితమైన చిత్రం క్షణాల్లోనే వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్‌కి ఎన్నో దశాబ్దాల పాటు తన దైన టాలెంట్ తో పాలన అందించిన నాయకుడిని ఇంత అనూహ్యంగా, మానవతా దృక్కోణం లేకుండా అరెస్ట్ చేయడం ప్రజల మనసులను కదిలించింది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్  అనుచరులు ఆ సమయంలో చంద్రబాబు ఈ పరిస్థితిలో ఉండటాన్ని చూసి తాత్కాలిక సంతోషం పొందినప్పటికీ, ఈ ఒక్క ఫోటోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చేస్తుందని వారు ఊహించలేదు.



ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా 70కిపైగా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల హృదయాలను తాకింది. చంద్రబాబు అరెస్ట్‌పై వ్యతిరేక స్వరాలు ఉధృతంగా వినిపించాయి. ఈ ఫోటో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో కన్నీళ్లు తెప్పించింది. తమ దూరదృష్టి గల నాయకుడిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పం వారికి కలిగింది. ఒక భావోద్వేగ ఫోటోగా ప్రారంభమైన ఈ చిత్రం, 2024 ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే చారిత్రక చిహ్నంగా మారిపోయింది. ఇలాంటి ప్రబలమైన ప్రభావం చూపగలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఆధునిక రాజకీయ చరిత్రలో తన స్థానాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: