
మాజీ సీఎం వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ మూవీ అని కామెంట్లు చేశారు. ఈ ప్లాప్ మూవీకి బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారంటూ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్దాలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయని కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సూపర్ సిక్స్ అట్టర్ ప్లాఫ్ అని ప్రజలకు ఇప్పటికే అర్థమైందని ఈ యాడ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన యాడ్ అని ఆడబిడ్డ పేరుతో నెలకు 1500 ఇస్తామని హామీ ఇచ్చారని ఆ డబ్బులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి 72 వేలు బాకీ పడ్డారని 5 లక్షల పెన్షనర్ల సంఖ్యా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ, లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు .
ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఆదాయం తగ్గుతోందని చంద్రబాబు, ఆయన మాఫియాకు జరుగుతోందని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి మాత్రమే కనిపిస్తోందని జగన్ కామెంట్లు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బలవంతపు సంబరాలు చేస్తున్నారని జగన్ కామెంట్లు చేశారు. చంద్రబాబు పాలనలో అప్పులు ఎగబాకాయని ఆయన పేర్కొన్నారు.
తాము ప్రజలకు మంచి చేసామని అయితే ఆ మంచిని చెప్పలేకపోయామని జగన్ కామెంట్లు చేశారు. తమ పీఆర్ వ్యవస్థ వల్లే ఈ తప్పు జరిగిందని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు