ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే మంత్రులుగా  కొండా సురేఖ, సీతక్క ఉన్నారు.. అయితే సీతక్క పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నారు. అలాగే కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు కొనసాగుతున్నారు. ఇదే తరుణంలో తాజాగా ఈ జిల్లాలో ఆ మంత్రికి మరియు ఒక ఎమ్మెల్యేకు మధ్య సఖ్యత కుదరలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మంత్రి ప్రతిసారి ఏదో ఒక విషయంలో వేలు పెడుతూ తనను ఇబ్బంది చేస్తోందని ఆ ఎమ్మెల్యే తెలియజేశారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరయ్యా అంటే కొండా సురేఖ. 

అయితే  వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విషయంలో కాస్త దూకుడు ప్రదర్శించిందని ఆయన సురేఖ పై బహిరంగంగానే మండిపడ్డారు. ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని మంత్రి సురేఖకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక మంత్రి హోదాలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లాలని, ఏదైనా సమస్యలు వస్తే క్లియర్ చేయాలని అన్నారు. కానీ మంత్రి హోదాలో ఉండి అనవసరంగా చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేయకూడదని సూచించారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి ఆలయ సభ్యుల నియామకంలో మంత్రి సురేఖ తనకు నచ్చిన వారికే పదవులు ఇప్పించడం సమంజసం కాదన్నారు.

నా నియోజకవర్గంలో నా ప్రమేయం లేకుండా ఇలా ఆమెకు నచ్చిన వారికి పదవులు ఇవ్వడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. మంత్రి వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలియజేశారు. ఈ విధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడడంతో అది కాస్త వివాదంగా మారింది. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఏర్పడ్డాయని, మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య కుదరడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి అధిష్టానం ఈ సమస్యపై  మాట్లాడి సిట్రైట్ చేస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: