
దీంతో నకిలీ మద్యం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట అంటూ నారావారి సారా వద్దు అనే కాన్సెప్ట్ తో ధర్నా చేపట్టారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీయవద్దనే నినాదాలతో ఏపీ అంతట ఈ ధర్నా చేశారు. ఇందులో భాగంగా వినుకొండ కార్యక్రమంలో ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ..కూటమి ఎమ్మెల్యేలు నేతలు, తమ జేబులు నింపుకోవడానికి ఇలాంటి కల్తీ మద్యాన్ని తయారుచేసి ప్రజల ప్రాణాలను బలి కొంటున్నారని , నకిలీ మద్యం తయారుచేసిన వాళ్లపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటు వీటి మీద సిట్ అధికారులు దర్యాప్తు చేపించేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆడవాళ్ళందరూ మందు తాగుతూ తమ ప్రవర్తనను ప్రపంచానికి చూపిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో మహిళలను తాగుబోతులుగా అభివర్ణించి వారిని కించపరిచేలా మాట్లాడారంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లాపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు కూడా పాల్గొని నిరసనలు తెలియజేశారు. ఇలాంటి సమయంలోనే మహిళలను తాగుబోతులు అంటూ చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వివాదంలో చిక్కుకున్నారు. మరి ఈ విషయం పైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.