సాధారణంగా మంత్రులు ఆదేశాలిస్తే కలెక్టర్లు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఇంకా జిల్లా మంత్రులు చెప్తే అధికారులు పరుగులు పెట్టి మరీ పనులు చేస్తారు. అలాంటిది ఆ జిల్లాకు చెందిన మంత్రి చెబితే ఒక కలెక్టర్ కనీసం పట్టించుకోలేదట. చివరికి అదే పనిని ఏపీ మంత్రి చెబితే నిమిషాల్లో పూర్తి చేశారట.. ఆ మంత్రులు ఎవరు అనేది బయటకు రాలేదు. కానీ ఆ కలెక్టర్ చేసిన పనికి తెలంగాణ మంత్రి మండి పడుతున్నారని తెలుస్తోంది..ఇక ఉమ్మడి వరంగల్ కు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సినీ ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు.. అయితే ఆయనకు గ్రేటర్ వరంగల్ లో రెండు ఎకరాలకు పైగా భూముంది. అయితే ఆ భూమి గత 50 సంవత్సరాలుగా ఆయన తల్లిదండ్రుల పేర్లపై ఉంది. కానీ ధరణి పోర్టల్ లో  ఇతర వ్యక్తుల పేర్ల మీద నమోదయ్యింది. ఇక ఈ విషయాన్ని గమనించిన సదరు సినీ ప్రముఖుడు కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు.. 

కానీ ఆ కలెక్టర్ పట్టించుకోకపోవడంతో ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి కొందరు మంత్రులకు ఈ విషయాన్ని చెప్పారు. వాళ్లు కలెక్టర్ కు నేరుగా ఫోన్ చేసి ఈ సమస్య క్లియర్ చేయాలని చెప్పారు. కానీ పని ఏమాత్రం కాలేదు. వెంటనే విసిగిపోయిన బాధితుడు ఓసారి అమరావతికి ఏదో పనిమీద వెళ్లి తన పరిచయాలతో ఏపీలోని ఒక మంత్రిని కలిశారు. అతనికి తన సమస్య మొత్తం వివరించడంతో వెంటనే ఆయన సదరు కలెక్టర్ కు ఫోన్ చేసి సమస్య క్లియర్ చేయాలని చెప్పారు. వెంటనే ఆ బాధితుడి సమస్య పూర్తిగా క్లియర్ అయిపోయి ధరణి పోర్టల్ లో  వారి తల్లిదండ్రుల పేరు మీద భూమి నమోదు అయింది. ఇక ఈ విషయం కాస్త బయటపడడంతో కలెక్టర్లు తెలంగాణ మంత్రులకు అస్సలు విలువ ఇవ్వడం లేదా అనే విమర్శలు కూడా వస్తున్నాయి.

పక్క రాష్ట్రం మంత్రి చెప్తే పని అయింది, కానీ లోకల్ మంత్రి చెబితే పని కాలేదని ఆ బాధితులు పలువురికి చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ పవర్ లేని తెలంగాణ మంత్రి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఆ మంత్రి పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు భూముల సమస్యలు క్లియర్ చేయాలని అన్ని విధాల ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వారికి సంబంధించిన అన్ని పవర్స్ కూడా ఇచ్చింది. అయితే సదరు సినీ ప్రముఖుడి భూమి సమస్య క్లియర్ చేసే అవకాశం కలెక్టర్ కున్నా కానీ తెలంగాణ మంత్రి చెబితే ఆయన పట్టించుకోలేదు. ఏపీ మంత్రి చెప్పగానే టక్కున పనిచేసి పెట్టడంతో ఇది కాస్త విమర్శలకు దారితీస్తోంది. మరి ఆ మంత్రులు ఎవరు..కలెక్టర్ ఎవరు అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: