ఆంధ్రప్రదేశ్లోని ఉద్దానం ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కిడ్నీ వ్యాధిగ్రహస్తులు ఇబ్బందులు పడుతున్నారు. 2019 వరకు ఎంతో మంది రాజకీయ నేతలు అక్కడ వారికి పరిష్కారం చూపించలేకపోయారు. కాని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రమే వారికి శాశ్వత పరిష్కారం ఆలోచన చేశారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలను ఏ రాజకీయ పార్టీలు చేయలేకపోయాయి తమ ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కారం చూపించిందంటూ  వైసీపీ నేతలు ఇప్పుడు తెలియజేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారని తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా అక్కడ భూగర్భ జలాల నీరు తాగడం వల్లే ఈ కిడ్నీ సమస్యలు వస్తోందని వైద్యులు సూచించడంతో అక్కడ మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.800 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ నుంచి నీరు తెప్పించారంటూ తెలియజేస్తున్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు వైసిపి పార్టీ ఏం చేసిందో ప్రచారం చేసుకోలేకపోయింది . వైసిపి అధికారంలో వచ్చిన ఇన్ఫోసిస్ కి ఇంత ప్రచారం చేయలేకపోయింది. ఒకవేళ అదే కనుక చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వచ్చి ఉంటే ఎంత ప్రచారం చేసేవారో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం.


కానీ ఉద్దానం వంటి ప్రాంతంలో కిడ్నీ వ్యాధి గ్రహస్తులను ఆదుకున్నది మాత్రం వైఎస్ జగన్. అక్కడ హాస్పిటల్స్ ను పెంచారు, అక్కడ ప్రజలకు ట్రీట్మెంట్ ఇప్పించడమే కాకుండా మంచినీళ్లు అన్ని సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు. కానీ ప్రచారం మాత్రం చేసుకోలేకపోయింది వైసీపీ పార్టీ. అయితే వైసిపి పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలో ఉన్న టిడిపి గతంలో చాలనే దుష్ప్రచారాలు చేసింది. ఇప్పుడు కూడా చాలా వాటి మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడంతో  ఉద్దానం ప్రాంతాన్ని ఒక క్యాంపెయిన్ గా తీసుకొని , వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు, సోషల్ మీడియాలో ఉద్దానం ప్రాంతంలో గత ప్రభుత్వం ఏం చేసింది అనే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసిపి పార్టీ తమ హయాంలో జరిగిన వాటిని చెప్పుకొనే కార్యక్రమం మొదలుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: