ఋతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు—ఈ పేర్లు కేవలం సీరియల్స్ పేర్లే అని మీరు అనుకుంటే, అది పూర్తిగా పొరపాటు. ఈ సీరియల్స్ కొంత మంది లేడీస్ కి ఒక ఎమోషన్, ఒక బ్రాండ్‌లాంటి స్థాయి కలిగినవి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ దృష్టిలో ఈ మూడు సీరియల్స్ ఎంతో ప్రత్యేక స్థానం పొందాయి. ఈ సీరియల్స్ చూస్తున్నప్పుడు అభిమానుల మనసులు ఆనందంతో నిండిపోయాయి. ఈ సీరియల్స్ కొన్ని సంవత్సరాల క్రితం టెలికాస్ట్ అయినప్పటికి.. ఇప్పటికి ట్రెండింగ్ లో ఉంటాయి. ఈ సీరియల్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించాయి. 80–90 కిడ్స్ కి ఈ సీరియల్స్ చాలా ఫేవరెట్‌గా మారాయి. సీరియల్ టెలికాస్ట్ అయ్యే ముందు వచ్చే టైటిల్ సాంగ్ ఉంటుంది చూశారా.. అది మరో లెవెల్‌కి వెళ్తుంది. అప్పటి పెద్ద స్టార్ హీరోల సినిమాలో సాంగ్స్‌ను పెద్దగా పట్టించుకోకపోయినా, ప్రేక్షకులు సీరియల్స్ లోని పాటలను పెద్ద ఆసక్తితో ఆలపించారు. ఈ అద్భుతమైన పాటలు ఎవరు కంపోజ్ చేశారు అంటే… గాడిచర్ల సత్యనారాయణ అలియాస్ పంటి. ఆయన ఎంబిఎస్ చదివి డాక్టర్‌గా కూడా వర్క్ చేశారు. అయినప్పటికీ మ్యూజిక్ పై ఉన్న ప్యాషన్ వల్ల మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తన నేపథ్యాన్ని, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారో అనే విషయాని షేర్ చేశారు.

సత్యనారాయణ మాట్లాడుతూ.."నేను మొదట సింగర్‌గా, ఆ తర్వాత డాక్టర్‌గా అడుగు పెట్టాను. చెన్నై వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రయత్నించాను, కానీ అది సాఫల్యం సాధించలేదు. తరువాత హైదరాబాద్ కి వచ్చి క్లినిక్ పెట్టాను. మా క్లినిక్ దగ్గర ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో, డైరెక్టర్ మంజుల నాయుడు గారిని చూశాను. ఆ సమయంలో ఆమె భర్త ..కొడుకుకి యాక్సిడెంట్ అయిన కారణంగా నా దగ్గరకు తీసుకువచ్చారు. అప్పుడు పరిచయం చేసుకొని, నేను మ్యూజిక్ డైరెక్టర్‌ అని అప్పటికే చేసిన కొన్ని పాటలు వినిపించాను. అప్పుడు మంజుల నాయుడు గారు చాలా బాగున్నాయి అని అన్నారు. ఆ విధంగా మొదట సుశీల సీరియల్‌కి నాకు ఛాన్స్ ఇచ్చారు. సింగర్ సునీతతో టైటిల్ సాంగ్ పాడించగా, అది సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ఋతురాగాలు సీరియల్‌కి అవకాశం వచ్చింది. తర్వాత "వసంత సమీరంల..నను వెచ్చని గ్రీష్మంలా’ అనే పాటను 15 నిమిషాల్లోనే కంపోజ్ చేసి ఇచ్చాను. ఆ పాటను కూడా సునీత పాడారు. అది కూడా హిట్ అయ్యి, నాకు మంచి గుర్తింపు వచ్చింది."

ఆ తర్వాత సత్యనారాయణ 70కి పైగా సీరియల్స్ కోసం పాటలు కంపోజ్ చేశారు. చక్రవాకం, మొగలిరేకులు, బుతురాగాలు వంటి టైటిల్ సాంగ్స్ అందులో ఉన్నాయి.తాజాగా, ఆయన శుభం సినిమాలోని "పాలు నీళ్ల బంధం" అనే పాట కూడా పాడారు. ఈ పాటకి మంచి రెస్పాన్స్ పొందారు. "సోమవారం నుంచి శుక్రవారం వరకు రెండు హాస్పిటల్స్‌లో పనిచేస్తాను. శనివారం, ఆదివారం మ్యూజిక్ చేస్తూ, అప్పుడప్పుడు నా ఓన్ క్లినిక్ కూడా చూసుకుంటాను." అని సత్య నారయణ చెప్పుకొచ్చారు..!




మరింత సమాచారం తెలుసుకోండి: