చంద్రబాబు కి ఆత్మవిశ్వాసం కంటే అతిశయం ఎక్కువని అంటారు. గొప్పలు చెప్పుకోవడంతో ఆయనకు ఆయనే సాటి అని పేరు కూడా ఉంది. అనుకూలమైనవన్నీ తన ఖాతాలో వ్యతిరేకం అనిపించినవి ఇతరుల మీదకు తోసేయడం బాబు మార్క్ పాలిట్రిక్స్ అని కూడా అంటారు. ఇక బాబు తన గురించి చెప్పుకోని రోజు అంటూ ఉండదని సెటైర్లు కూడా పడుతూంటాయి.

 

విశాఖ రోడ్డు షోలో చంద్రబాబు తన పాలన గురించి చెప్పింది తక్కువ. జగన్, మోడీ, కేసీయార్ ఈ ముగ్గురు గురించి ఆయన తిట్ల పురాణమే ఎక్కువ. ఆ ముగ్గురూ అంటూ తన ప్రచారం మొత్తం నెగిటివ్ మోడ్ లోనే చేస్తూ పోయారు. వీళ్లంతా కలపి వస్తున్నారు. ఒక్కటిగా వస్తున్నారు. అందరి జాతకాలు నాకు తెలుసు. నన్నేవరూ ఏం చేయేలేరు ఇలా సాగింది బాబు ప్రసంగం. నిజానికి ఇందులో బాబు సినిమాటిక్ సవాళ్ళు, డైలాగులు తప్ప ప్రచారంలో జనాలకు చెప్పింది ఏమీ లేదని తమ్ముళ్ళే పెదవి విరుస్తున్నారు.


 

పూర్తిగా రొటీన్ రొడ్డ కొట్టుడు స్పీచ్ బాబు చేస్తూ వచ్చిన క్యాడర్ కి ఏ మాత్రం జోష్ నింపలేకపోయారని అంటున్నారు. ఇదిలా ఉండగా తన స్పీచ్ లో బాబు మోడీకి తనకూ పోలికా అంటూ ఎకసెక్కం ఆడారు. తాను 1995లోనే ఏపీకి సీఎం అయ్యానని, మోడీ 2002లో గుజురాత్ కి సీఎం అయ్యారని బాబు చెప్పుకొచ్చారు. ఆ విధంగా మోడీ కంటే తాను ఏ డేళ్ళు సీనియర్ సీఎం అని కూడా బాబు చెప్పారు. అయితే దీని మీద బీజేపీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. మోడీకి సొంత మామ ఎవరూ ముఖ్యమంత్రిగా లేరని, ఆయన వెన్నుపోటుతో సీఎం కాలేదని కూడా అంటున్నారు.



పైగా మోడీ 1977 నుంచి ఆరెసెస్ ఇతర అనుబంధ సంఘాల ద్వారా ప్రజాసేవలో ఉన్నారని కూడా గుర్తు చేస్తున్నారు. పదవులే కొలమానం అయితే ఎపుడూ అధికార పదవులు చేపట్టని వామపక్షాలు అసలు ప్రజా నాయకులు కారా బాబూ అంటూ కౌంటర్లేస్తున్నారు. ఎపుడు వచ్చారన్నది కాదు అని ఓ సినిమా లో డైలాగ్ లా మోడీ వెనకనే వచ్చినా దేశానికి ప్రధాని అయ్యారన్న సంగతిని బాబు గుర్తుంచుకోవాలని కూడా అటాక్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటికి ఎన్నో సార్లు బాబు మోడీ సీనియారిటీని చెప్పి తక్కువ చేయాలని చూసినా అది ఎందుకో బూమరాంగ్ అవుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: