నేటి మంచిమాట..  ఓడిపోతాం అనే భయంతో ఆటలోకి దిగితే ఎప్పటికీ గెలవలేం! అవును.. ఏలా గెలుస్తాం. మనం ఏదైనా సాధించాలి అంటే ముందు మనకు దైర్యం ఉండాలి. కానీ కొందరికి ఆ దైర్యం ఉండదు. అన్నిటికి బయపడుతారు. గెలిచే శక్తి  వాళ్లకు ఉంటుంది. కానీ భయంతో వెనకడుగు వేస్తారు. 

 

IHG

 

ఎందుకంటే వారిపై వారికీ నమ్మకం ఉండదు. మనం ఏం సాధించగలం అని అనుకుంటుంటారు. అంతేకాదు.. గెలిచే శక్తి ఉన్న వారికీ పాజిటివ్ గా ఆలోచించడం రాదు. అన్ని నెగెటివ్ గానే ఆలోచిస్తారు. మనం ప్రయత్నించి ఓడిపోతే చుసిన వారు అందరూ నవ్వుతారు ఏమో.. నవ్వులపాలు అవుతాం కదా అని.. 

 

IHG

 

అలా ఆలోచించకూడదు.. మనం ఒకసారి ఓడిపోతే ఏం మళ్లీ ప్రయత్నించే శక్తి మనకు ఉంది కదా! మళ్లీ ప్రయత్నించాలి.. మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. మన ప్రయత్నాలు చూసి ఓటమికే విసుగు రావాలి.. అప్పుడు గెలుస్తాం.. అప్పుడు వచ్చే ఆనందం వెలకట్టలేనిది. అందుకే ఏది కూడా ఓడిపోతాం అని అనుకోకూడదు. 

 

IHG

 

మనపై మనకు నమ్మకం ఉండాలి. ఓటమి అనే భయమే ఉండకూడదు.. నీకు చేతకాదు.. నీకు సాధ్యం కాదు అని అనిపించినా సరే నేను గెలుస్తా అనే ధైర్యంతో పోటీ పడాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. అప్పుడే మన జీవితం బాగుంటుంది. మనం ఉన్నత స్థాయికి చేరాలి అంటే మనకు ముందుగా దైర్యం ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: