రియో ఒలంపిక్స్ లో ఆశలన్నీ సజీవంగా ఉంచాడు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్.. పురుషుల సింగిల్స్ లో డెన్మార్క్ క్రీడాకారుడి జార్గెన్సెన్ ను 21-19, 21-19 తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. అయితే మ్యాచ్ మొత్తం చాలా టఫ్ గా కొనసాగింది. ప్రత్యర్ధి గట్టి పోటీ ఇచ్చినా శ్రీకాంత్ తన సత్తా చాటాడు. అయితే క్వార్టర్ లో హేమాహేమీలతో పోటీ పడుతున్నారు.

కిదాంబి శ్రీకాంత్ ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ అయినా లిన్ డాన్ తో తలపడనున్నాడు. బాడ్మింటన్ సింగిల్స్ తో తనకు సాటి లేరు అనేలా ప్రపంచ చాంపియన్ అనిపించుకున్న లిన్ డాన్ తో శ్రీకాంత్ పోటీ చాలా రసవత్తరంగా సాగనుంది. ఇక రెజ్లింగ్ ప్రీ క్వార్టర్స్ లో భారత క్రీడాకారుడు రవీందర్ ఖత్రి ఓటమిపాలాయి నిరాశ పరచాడు. 85 కిలోల విభాగంలో హంగేరికి చెందినా లోరిన్జ్స్ విక్టర్ చేతిలో పరాజయ పాలయ్యాడు రవీందర్.

ఇక ఇదే కాదు ట్రిపుల్ జంప్ లో కూడా భారత క్రీడాకారులు నిరాశ పరచారు. అర్హత పోతీల్లోనే రంజిత్ మహేశ్వరి 16.13 తో పూర్తీ చేసి 30 స్థానంలో నిలవడం జరిగింది. ఇక పోటీల్లో కేవలం తొలి 12మంది ఫైనల్స్ కు అర్హట సాధించారు.