గత ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దాదాపు 12 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియాలోకి వచ్చిన సీనియర్ బౌలర్ జయదేవ్ ఉనాద్గత్ అప్పటినుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. టీమిండియాలోకి వచ్చి తన ప్రదర్శనతో ఆకట్టుకున్న జయదేవ్ ఉనాద్గత్ ఇప్పుడు రంజి ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర కెప్టెన్ గా కొనసాగుతూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. కాగా రంజి ట్రోఫీలో భాగంగా ఒక వైపు కెప్టెన్ గా జట్టు తన వ్యూహాలతో ముందుకు నడిపిస్తూనే.. మరోవైపు ఆటగాడిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన కనపరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోని ఈ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం అటు జయదేవ్ ఉనాద్గత్ కెప్టెన్సీ వహిస్తున్న సౌరాష్ట్ర జట్టు జైత్రయాత్ర కొనసాగుతూ ఉంది. ఆ జట్టు వరుస విషయాలతో ప్రత్యర్ధులను చిత్తు చేస్తూనే ఉంది. 2022 డిసెంబర్ లో ముంబై పై  విజయం సాధించిన సౌరాష్ట్ర.. ఆ తర్వాత ఢిల్లీ పై 214 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు తాజాగా   హైదరాబాద్ ను 57 అడుగుల తేడాతో మట్టి కరీపించింది. ఇక ఇటీవల హైదరాబాద్ తో  జరిగిన మ్యాచ్ లో కూడా ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయిన సౌరాష్ట హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది అని చెప్పాలి.


 హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో భాగంగా అటు జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న జయదేవ్ ఉనాద్గత్ అదరగొట్టాడు అని చెప్పాలి. ఏకంగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు జయదేవ్ ఉనాద్గత్ తోడుగా నరేంద్రసిన్హ జడేజా రాణించడంతో సౌరాష్ట్ర జట్టు ప్రస్తుతం వరుసగా మూడో విజయాన్ని సాధించింది అని చెప్పాలి.  అయితే ఇక సౌరాష్ట్ర బౌలింగ్ విభాగం విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక తర్వాత రెండో ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ లో పుంజుకోలేకపోయింది హైదరాబాద్ జట్టు. దీంతో ఇక ఈ రంజి ట్రోఫీలో భాగంగా వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: