క్రికెట్ మ్యాచ్ అంటే ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్కంఠంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఇక టి20 ఫార్మాట్లో జరిగే మెరాకిల్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగి అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.  ప్రస్తుతం ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్మిత్ బిగ్ బాష్ లీగ్ లో ఆడుతూ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కిడ్నీ సిక్సర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


 ఇకపోతే ఇటీవలే ఈ లీగ్ లో భాగంగా ఆడిలైట్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. కేవలం 56 బంతుల్లోనే ఐదు ఫోర్లు 7 సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేసి బౌలర్లపై వీర విహారం చేశాడు. అయితే ఇక ఇలా వీరోచితమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న స్మిత్ కి ఇక మ్యాచ్ మధ్యలో తన ఇన్నింగ్స్ ను నిర్మించుకుంటున్న సమయంలో అదృష్టం కూడా బాగా కలిసి వచ్చింది. ఐసీసీ రూల్స్ ప్రకారం బంతి వికెట్లకు తాకడమే కాదు ఇక వికెట్ల పైన ఉన్న బెయిల్స్ ఎగిరి కింద పడినప్పుడే వికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.  ఇక ఈ రూల్స్ స్మిత్ కు బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి.


 అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి వికెట్లను తాకినప్పటికీ.. రూల్ ప్రకారం బెయిల్ కింద పడకపోవడంతో స్మిత్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. హరి కాన్వే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. కాన్వే వేసిన బంతి స్మిత్ బ్యాట్స్ సందులో నుంచి మిడిల్ వికెట్ కు తాకింది. అయితే బంతి బలంగా తగలకపోవడంతో బెయిల్  మాత్రం కదల్లేదు.  ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్న స్మిత్ బంతిని తీసుకొని ఇక ఫీల్డర్ కు అందజేసాడు. ఇక ఆ సమయంలో స్మిత్ కేవలం రెండు పరుగుల వద్ద మాత్రమే ఉండడం గమనార్హం. దీంతో అదృష్టం కలిసి వచ్చి ఇక భారీ ఇన్నింగ్స్ నిర్మించి సెంచరీ తో చెలరేగాడు స్మిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: