లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇక ఈ డైలాగ్ కి సరిగ్గా సరిపోయే విధంగా క్రికెట్లో కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చివరి బంతి వరకు కూడా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఇక బ్యాట్స్మెన్ చివరి బంతికి ఫోర్ లేదా సిక్సర్ కొట్టి జట్టును గెలిపించడం లాంటివి చేస్తూ ఉంటాడు. దీంతో ఇక ఏం జరుగుతుందో అని అటు స్టేడియంలో.. ఇటు టీవీల ముందు కూర్చుని కన్నారపకుండా చూస్తున్న ప్రేక్షకులు ఇక చివరికి బ్యాట్స్మెన్ బౌండరీ బాది  జట్టును గెలిపించడంతో ఒక్కసారిగా ఎగిరి గంతేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 టి20 ఫార్మాట్లో ఇక ఇలాంటి ఉత్కంఠ భరితమైన మ్యాచులు ఎక్కువగా చూడొచ్చు.  ఇక ఇటీవలే ధోని స్నేహితుడు కూడా ఇలాగే చివరి నిమిషంలో ఫోర్ కొట్టి జట్టును గెలిపించి అభిమానులందరికీ ఎగిరి గంతేసే ఆనందాన్ని ఇచ్చేశాడు అని చెప్పాలి. అతను ఎవరో కాదు డ్వెన్ ప్రిటోరియస్ . గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని సారధ్యంలో అతను ఆడిన సంగతి తెలిసిందే. ఇక డ్వెన్ ప్రిటోరియస్  ధోని నమ్మిన బంటుగా కూడా ప్రేక్షకులు పిలుచుకునేవారు. ఇకపోతే ఇతను ప్రస్తుతం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతూ ఉన్నాడు.



 క్వెట్ట  గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ మధ్య ఇటీవలే మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది అని చెప్పాలి. చివరి ఆరు బంతుల్లో కరాచీ కింగ్స్ 8 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక స్కోర్ పెద్దగా లేకపోయినప్పటికీ బౌలర్లు పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బంతులు వేశారు. చివరి ఓవర్లో యామిన్ బౌలింగ్ వేయగా మొదటి బంతికి మార్టిన్ గప్తిల్  వికెట్ దక్కింది. ఇక అప్పుడుక్రీజు క్రేజీ లోకి వచ్చాడు ధోని ఓల్డ్ ఫ్రెండ్ ప్రిటోరియస్   ఇంకా 5 బంతుల్లో ఏడు పరుగులు కావాల్సిన సమయంలో తొలి బంతికే ఫోర్ కొట్టాడు.  తర్వాత నాలుగో బంతికి రెండు పరుగులు.. ఇక ఐదో బంద్ కి చివరిలో లాస్ట్ పంచ్ అన్నట్లుగా ఫోర్ కొట్టి క్వేట్ట  గ్లాడియేటర్స్ ను గెలిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: