మూడు వారాల పాటుగా ఎంతో ఆసక్తికరంగా సాగిన మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ ఈ రోజు ముంబైలో జరగనున్న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. ఈ సీజన్ ను బీసీసీఐ అయిదు జట్లతో మాత్రమే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరియు గుజరాత్ లు మహిళల ప్రీమియర్ లీగ్ లో కొనసాగడం విశేషం . ఇక ఈ నాలుగు జట్లు కాకుండా కొత్తగా యూపీ వారియర్స్ ఈ లీగ్ లో చోటు దక్కించుకుంది.

లీగ్ దశలో ఒక్కో జట్టు ఎనిమిది మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా అందులో మంచి ప్రదర్శన కనబరిచిన మొదటి మూడు జట్లకు ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంది. అలా ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ మరియు యూపీ వారియర్స్ లు వరుసగా మూడు స్థానాలలో నిలిచారు. కాగా మొదటి స్థానంలో నిలిచిన ఢిల్లీ డైరెక్ట్ గా ఫైనల్ చేరింది. రెండు మూడు స్థానాలలో ఉన్న ముంబై మరియు యూపీ వారియర్స్ లు ఎలిమినేటర్ లో తలపడి ముంబై గెలిచింది. దీనితో ఈ రోజు సాయంత్రం ముంబై వేదికగా ముంబై మరియు ఢిల్లీ జట్ల మధ్యన మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరగనుంది. ఈ రెండు జట్లలో మొదటి టైటిల్ ను గెలుచుకునే సత్తా మాత్రం ఇరువురికి సమానంగా ఉందని చెప్పాలి.

రెండు జట్లు కూడా అని విభాగాలలో సమానంగా ఉన్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఆల్ రౌండ్ ప్రతిభతో యూపీ వారియర్స్ ను ఓడించిన విధానం ఢిల్లీ ని ఒకింత ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. కానీ ఢిల్లీ లో స్వేచ్ఛగా ఆడే ప్లేయర్స్ ఉండడం వారికి లభించే అంశం. ఇరు జట్లలో కీలక ప్లేయర్ లుగా ఉన్న వారు మరోసారి రాణిస్తే టైటిల్ ఎవరికి అయినా దక్కుతుంది. మరి ఈ ఫైనల్ పోరులో భారీ స్కోర్ నమోదు అవుతుందా లేదా లౌ స్కోర్ థ్రిల్లర్ గ నిలుస్తుందా తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: