గత కొంతకాలం నుంచి గాయాల బెడదతో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ దీపక్ చాహార్. అయితే 2023 ఐపీఎల్ సీజన్లోనూ అటు చెన్నై తరపున ఒక మ్యాచ్ ఆడాడో లేదో మళ్లీ పాత గాయం తిరగబెట్టడంతో ఇక క్రికెట్కు దూరం అయ్యాడు. అయితే ఇటీవల గాయం నుంచి కోలుకొని ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిపోయాడు దీపక్ చాహార్. మొదటి మ్యాచ్ లోనే మంచి బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఇషాన్ కిషన్ లాంటి కీలకమైన వికెట్ పడగొట్టాడు అని చెప్పాలి.



 అయితే దీపక్ చాహార్ కి దాదాపు 568 రోజుల తర్వాత ఐపీఎల్లో ఇదే మొదటి వికెట్ అని చెప్పాలి. ఎందుకంటే చివరగా ఐపీఎల్ 2021 ఫైనల్ లో వికెట్ తీశాడు. తర్వాత గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి కూడా దూరం అయ్యాడు. ఇక 2023 సీజన్లో సీఎస్కే తరఫున ఆడిన మొదటి మ్యాచ్ లోనే గాయం కారణంగా మళ్ళీ దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గతంలో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకోవడంతో విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల ముంబై తో జరిగిన మ్యాచ్లో మాత్రం మూడు ఓవర్లు వేసిన దీపక్ చాహార్ 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసాడు.




 ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి తొలిత ఇషాన్ కిషన్ ను ఔట్ చేసిన దీపక్ చాహార్ ఆ తర్వాత నాలుగో బంతికి ధోని సూచనల మేరకు రోహిత్ ను బుట్టలో వేసుకొని రెండో వికెట్ను కూడా సంపాదించాడు. అయితే ధోని ఇచ్చిన సలహాతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం దీపక్ చాహార్ ను వదిలేయకుండా 14 కోట్లకు తమతోనే అంటిపెట్టుకుంది. అయితే ఇటీవలే దీపక్ చాహార్ దాదాపు 568 రోజుల తర్వాత తొలి వికెట్ సాధించడంతో.. ఒక్క వికెట్ విలువ 28 కోట్లు అంటూ ఒక అభిమాని పోస్ట్ చేయగా ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఏది ఏమైనా దీపక్ చాహార్ రాకతో చెన్నై బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl