హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. శివుడు అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అనే అర్థాలు వస్తాయి. సాధారణంగా శివుడు లింగ రూపంలో ఉంటాడు. ఏ గుడిలోనైనా శివుడిని మానవాకారంలో చూడలేం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం, అనంతపురం జిల్లాలోని ఆలయాల్లో మాత్రమే శివుడు మానవాకారంలో కనిపిస్తాడు. చిత్తూరు జిల్లాలోని తిరుపతికి 20 కి.మీ. దూరంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో ఏడు అడుగుడుల ఎత్తున ఉండే శిల్పంపై హిందువుల ఆరాధ్య దైవం శివుడు.. మానవ రూపంలో ఉన్నాడు. 

 

IHG


 
ఈ ఆలయం చాలా పురాతనమైనది. పురావస్తు శాఖ అధికారులు ఈ ఆలయంలో శివుడు మానవ రూపంలో కనిపించే శివలింగం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలం నాటిదని చెప్పింది. క్రీస్తు శకం 2009 వరకు ఈ ఆలయంలో పూజలు జరిగేవి కావు. తిరుపతిలో ఉండే రాస్‌ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన పోరాటం వల్ల కేంద్రం ఈ ఆలయంలో పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 
 
1911లోనే గోపీనాథరావు అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ ఆలయాన్ని వెలికి తీసినప్పటికీ గత పది సంవత్సరాల్లోనే ఈ ఆలయంలో మూలవిరాట్ కు పూజలు జరిగాయి. ఈ ఆలయం చోళులు, పల్లవులు పాలించే సమయంలో నిత్య పూజలతో తేజోవంతంగా ఉండేదని తెలుస్తోంది. అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని హేమావతి గ్రామంలో శివుడు సిద్ధాసనంలో కొలువై ఉన్నాడు. 

 

IHG
 


ఈ ఆలయంలో శివరాత్రి రోజు నుంచి 8 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నొలంబ వంశానికి చెందిన రాజులు చిత్రశేఖర, సోమశేఖరులు 7వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు వస్తారని తెలుస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో శిల్పకళను నేర్పే కళాశాల ఉండేదని చరిత్ర చెబుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే అగ్నిగుండం రోజున లక్షమంది వరకూ భక్తులు ఇక్కడకు వస్తారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: