శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు. విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు. అని వేదం చెబుతుంది. భగవంతుడు ఒక్కడే కానీ అయన రూపాలు అనేకం గ్రహించాలి. శివకేశవుల అద్వైతాన్ని- అభేద స్వరూపాన్ని అందమైన తెనుగు నుడికారంతో సులభసుందరంగా తేటపరిచే హృద్యపరిచే ఈ తేటగీతి పద్యం, ఈ సుధామయ సూక్తి, పోతన మహాకవి స్వీయస్ఫూర్తి. ‘ఈ తెలుగు పద్యం నోటికి రానివాడు ఆంధ్ర ఆంధ్ర భారతీయుడు కాడు. దానంతటదే నోటికి వచ్చే పద్యమిది. రాకుండా ఎలా ఉంటుంది, నోటికి తాళం వేసుకుంటే తప్ప’ అని కవి సమ్రాట్‌ వివ్వనాథ వారు సున్నితంగా సుత్తితో కొట్టారు.

తెలుగు సంవత్సరాలలో ఎనిమిదో నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం....కార్తీక మాసం సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు, దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది.

శివ,కేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకమాసం అని చెపుతారు పెద్దలు. ప్రతిఏటా దీపావళి వెళ్లిన మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అత్యంత మహిమాన్విత మైన కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్టలతో చేసే నోములు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెల రోజులు శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారు మోగిపోతాయి. శివ,పార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేస్తారు.

స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి “నకార్తీకే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సద్రసం శాస్త్రమ్‌...నతీర్థ గంగాయ సమం…” అని పేర్కొన్నారు...యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం,...గంగకు సమానమైనటువంటి నది లేనట్టే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనదేదీ లేదని పెద్దల మాట. శివకేశవులకు ప్రీతిపాత్రమై ఈ మాసంలో చేసే పూజలు, నోములు వ్రతాల వల్ల జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం...

మరింత సమాచారం తెలుసుకోండి: