శివరాత్రి అనేది చాలా మహత్తరమైన రోజు. ఆ రోజున శివ భక్తులంతా మహా భక్తితో పూజల్లో మునిగి తేలుతారు. శివరాత్రి నవరాత్రులు భక్తులంతా జాగారాలతో శివుని సేవలో ఉంటారు. అన్ని శివుని దేవాలయాలు ముక్కంటి నామ స్మరణలతో మారు మోగుతాయి.  భక్తుల ఉదరం నుంచి వచ్చే ఓంకార నాదంతో... ఓం నమఃశివాయ అంటూ భక్తులు... భక్తి తన్మయత్వంలో మునిగి పోతారు. అయితే ఈ సంవత్సరం మహా శివరాత్రి మార్చి 10 వ తేదీన వచ్చింది. కాబట్టి ఈ రోజుకు అత్యంత ప్రతిష్టాత్మకత  నెలకొంది. మాములుగా హిందువులు ఆచరించే హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలలో 13 వ రోజున ప్రదోష వ్రతం చేస్తారు.

ఇందులో భాగంగా పరమేశ్వరుడు, పార్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. మీ కుటుంబ సభ్యులు వ్రతం చేయడం వలన మీ పిల్లలు  మానసికంగా వృద్ధి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మరియు కొంచెం అయోమయంగా ఉండే పిల్లలకు తెలివి తేటలు వృద్ధి చెందుతాయి. అంతే కాకుండా చిన్నారులు ఆరోగ్యంగా ఉండటమే కాదు... వారి భవిష్యత్తు చక్కగా ఉంటుంది. ఈ వ్రతం వలన సర్వ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. అయితే ఏ సమయంలో ఈ వ్రతాన్ని చేయాలో తెలుసుకుందామా...?

ఈ ప్రదోష వ్రతానికి బుధవారం నాడు ఉదయం 10.40 కి ప్రారంభమవుతుంది. అది తిరిగి గురువారం అంటే మార్చి 11న మధ్యాహ్నం 2.37కి ప్రదోష వ్రత కాలం పూర్తవుతుంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ వ్రతం చేపట్టవచ్చు. ఈ వ్రతం చేపట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసిన వారికి ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలు అందుతాయి. మీ కోరికలు నెరవేరడమే కాకుండా...  భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీ యొక్క భక్తిని ఈ శివరాత్రి పర్వ దినాన నిరూపించుకోండి. వీలైతే శ్రీకాళహస్తి లోని శివాలయాన్ని దర్శించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: