పుణ్యం చేస్తే సుఖాలు... దుఖాలు జీవితంలో ఎదురవుతాయని పురోహితులు వేద పండితులు చెబుతున్నారు. కాని కర్మ యొక్క ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. కాబట్టి మనం చేసే ప్రతి చర్యను ఆచితూచి చేయాల్సి ఉంటుంది. జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో ఆలోచించి తీసుకోవాలి. మనం చేసే పనులు... భక్తి పూజలే నిర్ణయిస్తాయి అన్నది అసలు వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎరిగి తను చేసే ప్రతి కర్మను ధర్మాన్ని ఆచరించేవారు మంచి జీవితాన్ని పొందగలరు.
అలాగే దేవుడిపై నమ్మకం ఉండడం కూడా ఎంతో ప్రధానం. ఇది కూడా మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి నమ్మకం మాత్రమే ఉంటే సరిపోదు... భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం, ఆ దేవుడి అనుగ్రహం పొందేందుకు కర్మలు చేయాలి. దేవాలయాలకు వెళ్ళడం, దేవుడి యొక్క సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేయడం వల్ల కూడా మంచి కర్మ ఫలితాలు లభిస్తాయి. కావున దేవుడిపై భక్తి శ్రద్దలు కలిగి, మంచి కర్మలు చేయడం ద్వారా ఆనందమైన జీవితాన్ని పొందగలుగుతాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి