నేడు శ్రీరామనవమిని పురస్కరించుకొని హిందువులందరూ కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇక రామాలయాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడి పోతున్నాయ్. ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇలా సీతారాముల పెళ్లిని దగ్గరుండి జరిపించి భక్తి పారవశ్యంలో  మునిగి తేలాలని ఇక రామాలయాలకు తరలి వెళ్తూ ఉన్నారు భక్తులు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్వామివారి కల్యాణం లో పాల్గొంటున్నారు. ఇక ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రతి చోట  సీతారామ కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా శ్రీరామ నవమిని  పురస్కరించుకొని ఇక ఇప్పుడు ఒక రామాలయం కు సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది. సాధారణం గా రామాలయం అనగానే సీతా సమేత రామలక్ష్మణ విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. అంతే సమయం లో ఇక శ్రీరామ భక్తుడు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. శ్రీరాముడి పాదాల చెంత తన రాముడికి పూజ చేస్తూ ఆంజనేయుడు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం లేని రామాలయాన్ని అస్సలు ఊహించుకోలేం. కానీ ఇండియాలోనే ఆంజనేయుడు లేని రామాలయం ఒకచోట ఉందట.


 అది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒంటిమిట్ట రామాలయానికి ఈ ప్రత్యేకత ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఈ విశిష్టమైన రామాలయంలో సీతా రాముడు లక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో ఉంటాయి. ఆంజనేయుడి విగ్రహం మాత్రం ఉండదు. అందుకే ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం ఆంధ్ర భద్రాచలం గా పేరుగాంచింది. చంద్రుడి వెన్నెలలో సీతారాముల వారి కళ్యాణ నిర్వహించడం.. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇక ఇక్కడికి భక్తులు ఎప్పుడూ భారీగా తరలి వస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: