మనకు తెలిసిందే చాలా మంది శనివారం పూట వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. ఆరాధిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని స్పెషల్గా పూజిస్తారు . శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఎవరు పూజిస్తారో వారికి శని బాధలు ఉండవు అనేది  ఎక్కువగా నమ్ముతూ ఉంటారు . సాక్షాత్తు శని దేవుడు  శ్రీనివాసుడికి శనివారం నాడే వరం ఇచ్చాడట.  అందుకే జాతకం ప్రకారం ఎవరికైనా ఏళ్లనాటి శని ఉంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉండమని చెప్తూ ఉంటారు . గ్రహ సంచారం ప్రకారం శని బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి శనివారం నియమనిష్ఠలతో ఆ శ్రీనివాసుడిని పూజిస్తే శని బాధల నుంచి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది అంటూ చెబుతూ ఉంటారు . అయితే ఎందుకు శనివారం పూట వెంకటేశ్వర స్వామిని పూజించాలి..? ఎందుకు ఆయనకు శనివారం అంటే అంత ఇష్టం..? శనివారానికి వెంకటేశ్వర స్వామికి మధ్య సంబంధం ఏంటి ..? అనే విషయాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


మన పురాణాలలో శాస్త్రాలలో ఏ ఏ రోజు ఏ ఏ దేవుడికి పూజిస్తే మంచిది అనేది చాలా చక్కగా వివరించారు . శాస్త్రల ప్రకారం ఆదివారం సూర్య ఆరాధనకు శ్రేష్టమైనది అని అందరికీ తెలిసిందే . అలాగే సోమవారం మహా శివుడికి ..మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ..ఆంజనేయస్వామిని విశేషంగా పూజిస్తూ ఉంటారు . ఇక బుధవారం నాడు గణపతి పూజ ..అయ్యప్ప స్వామి పూజకు ..శ్రీరాముడు.. శ్రీకృష్ణుడు ఆరాధనకు శ్రేష్టమైనది అని చెప్పుకోవాలి . గురువారం సాయిబాబా.. దక్షిణామూర్తి.. దత్తాత్రేయ స్వామికి చాలా చాలా ప్రత్యేకమైనది.



ఆ గురువారం నాడు సాయిబాబా ని.. దక్షిణామూర్తిని ..దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటుంటారు మన ఇంట్లోని పెద్దవాళ్ళు . ఇక  శుక్రవారం లక్ష్మీదేవిని దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారు ఇంట్లోని ఆడవాళ్లు . కాగ శనివారం మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తారు.  ఎందుకు శనివారం వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.  సృష్టికి మూలంగా భావించే ఓంకారం ప్రభావించిన రోజు శనివారమే . ఆ కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు . అందుకే శ్రీనివాసుని పూజకు శనివారం చాలా విశిష్టమైనది.  శ్రీనివాసుడు తనకు ఆలయాన్ని నిర్మించమని తొండమణ్ చక్రవర్తిని ఆదేశించింది కూడా ఈ శనివారం నాడే కావడం అందుకు ప్రధాన కారణం . శ్రీనివాసుడు తొలిసారిగా ఆలయం ప్రవేశం చేసింది కూడా శనివారం నాడే . శ్రీనివాసుడు,, శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది కూడా శనివారమే . అంతేనా శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన చక్ర తల్వార్ అని పిలిచే సుదర్శన చక్రం పుట్టింది కూడా ఈ శనివారమే . ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శనివారం అంటే ఏడుకొండలవాడికి పరమ ప్రీతి . ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు కొలుచుకుంటూ ఆరాధిస్తూ పూజలు చేస్తే మాత్రం ఆయన శని బాధల నుంచి విముక్తి కలిగిస్తాడు..!


 

నోట్ : పైన తెలిపిన ఈ వివరాలు కొందరు నిపుణులు అలాగే వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అని గుర్తుంచుకోవాలి.  దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: