
గురువారం నాడు సాయిబాబా కి స్పెషల్గా పూజలు చేస్తే ఆయన మన కోరికలు తీరుస్తాడు అనే నమ్మకం భక్తులలో ఎప్పటినుంచో ఉంది . అంతేకాదు ఆలా పూజలు చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు . మరీ ముఖ్యంగా గురువారం నాడు సాయిబాబాకి పాలాభిషేకం చేసి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటూ కూడా ఎంతోమంది పండితులు చెబుతూ వచ్చారు. అయితే గురువారం నాడు ఎన్ని పూజలు చేసినా కూడా భార్యాభర్తలు ఒక తప్పు చేస్తే మాత్రం ఆ పూజ ఫలితం దక్కకుండా పోతుంది అంటున్నారు పండితులు .
ఎంత బాబా భక్తులైన సరే గురువారం నాడు పూజలు చేసి పుణ్యఫలం కోసం ప్రయత్నిస్తున్న వారు భార్యను ఏడిపించిన భార్య కన్నీటికి కారణమైన భార్యను మాటలతో బాధపెట్టిన భార్యను తంతు భార్య మీద దెబ్బ వేసే వాళ్ళు అస్సలు ఆ బాబా క్షమించడు అంటూ పండితులు చెప్తున్నారు. ఇంటికి మహాలక్ష్మి ఆడవాళ్లే . అది కూతురైన తల్లిన భార్య అయిన ఎవరైనా సరే వాళ్లు సంతోషంగా ఉంటేనే ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంగా కలకాలం ఉంటుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు .
అయితే ఇంటికి మహాలక్ష్మి అయిన ఆడవాళ్లను గురువారం పూట ఏడిపించిన వాళ్ల కన్నీటికి కారణమైన ఆ బాబా అసలు క్షమించడు అని .. వాళ్ళు ఎన్ని పూజలు చేసిన ఎంత శ్రద్ధగా ఆయన ని కొలిచిన ఆ పుణ్యఫలం వాళ్లకి దక్కనే దక్కదు అంటున్నారు పండితులు. కేవలం గురువారం మాత్రమే కాదు ప్రతి రోజు కూడా ఆడవాళ్ళను గౌరవిస్తూ ఉండాలి అని మన ఇంట్లోని పెద్దవారు చెప్తూనే ఉంటారు . కానీ కొంతమంది మాత్రం ఆడవాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు . మరియు ముఖ్యంగా కొంతమంది భర్తలు భార్యలను చాలా చీప్ గా హీనంగా చూస్తూ ఉంటారు . అలాంటి వాళ్ళు ఇకనైనా మేల్కొని భార్యకు రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు పెద్దలు..!
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కొంత మంది పండితులు అలాగే సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ఆధారంగా ఇవ్వబడినది. ఇది ఎవ్వరిని కించపరిచే ఉద్దేశంతో ఇవ్వబడినది కాదు. ఇది ఎంతవరకు నమ్మాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని పాఠకులు గుర్తుంచుకోవాలి..!!