
శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి చాలా చాలా స్పెషల్ అంటున్నారు పండితులు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శ్రావణ మాస పౌర్ణమి శనివారం వచ్చింది. ఈ రోజున చేసే దానానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది . ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులు దానం చేయడం వల్ల ఆ మహాశివుడు ఆశీర్వాదం పూర్తిగా పొందుతారు. ముఖ్యంగా అన్ని దానాలలోకి అన్నదానం చాలా చాలా పుణ్యం ఇస్తుంది అని అందరూ అంటుంటారు . పౌర్ణమి రోజు ఎవరైతే ఆకలితో కనిపిస్తారో .. తల్లిదండ్రులు లేని పిల్లలకు అదే విధంగా అన్నం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి కడుపునిండా అన్నం పెట్టడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంటున్నారు పండితులు .
శ్రావణమాసంలోని పౌర్ణమి నాడు పేదలకు అన్నం పెట్టిన ఆహారం విధంగా ఏదైనా సహాయం చేసిన.. దుస్తులు వంటివి దానం చేసిన ఎంతోపుణ్యం లభిస్తుంది . శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయి అంటున్నారు పండితులు . ఈ దానాల వల్ల జీవితంలో ఆనందం శాంతి కలుగుతుంది అంటూ చెబుతున్నారు . దానం చేసే వ్యక్తి వాటిని సంతృప్తికరంగా దానం చేయాలి .. మొక్కుబడిగా అయిష్టంగా దానం చేసిన ఆ ఫలితం దక్కదు . అంతేకాదు బెల్లం - నువ్వులు - దీపం లాంటివి దానం చేయడం కొందరు బ్రాహ్మణులకు దక్షిణగా డబ్బులు ఇవ్వడం పండ్లు, కాయగూరలు లాంటి చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అంటున్నారు పండితులు.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొంతమంది జ్యోతిష్య నిపుణులు చెప్పిన ఆధారంగా అందించబడినది . ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..!