మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నా తరచూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు. ఆయన తాజాగా పెట్టిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. టీం ఇండియా జట్టులో నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయాలనే అంశంపై ఎంతో కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.


ఈ విషయంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. విజయ్ హజారే ట్రోఫీలో యువ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గొప్పగా రాణిస్తున్నాడు. అయితే అతన్ని టీం ఇండియాలో నాలుగో స్థానంలో ఎందుకు తీసుకోవడం లేదు అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.


‘‘దేశవాళీ క్రికెట్‌లో ఇన్ని పరుగులు చేస్తున్నా.. సూర్యకుమార్‌ని జట్టులోకి ఎందుకు తీసుకోవడంలేదో నాకు అర్థం కావడం లేదు. సూర్యకుమార్ కష్టపడు.. నీకు టైం వస్తుంది’’ అంటూ హర్భజన్ సింగ్ తన ట్వీట్ లో ఆకాంక్షించారు.


అయితే ఈ ట్వీట్ పై అనూహ్యంగా యువరాజ్ స్పందించాడు. ‘‘యార్ నీకు ముందే చెప్పాను! వాళ్లకి నెం.4 అవసరం లేదు.. టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది’’ అంటూ యువరాజ్ సమాధానం ఇచ్చాడు. ఈ డిస్కషన్ ఫన్నీగా ఉన్నా.. అసలు సమస్య మాత్రం అలాగే ఉంది.టీమిండియాలో నెంబర్ 4 లో కంఫర్ట్ గా ఆడే ఆటగాడి కొరత మాత్రం ఇంకా తీరలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: