భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్  మహేంద్ర సింగ్ ధోనీ కి  ఇండియన్ క్రికెట్ లో ఎంత గొప్ప స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమర్థవంతమైన బ్యాట్స్మెన్ గా ... అద్భుతమైన కెప్టెన్గా... అదరగొట్టే ఫినిషర్ గా... అద్వితీయమైన వికెట్ కీపర్ గా ఇలా ప్రతి ఈ విషయంలో మహేంద్రసింగ్ ధోని కి ఎవరూ సాటి లేరు అని చెప్పాలి. క్లిష్ట  పరిస్థితుల్లో కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ లలో  విజయాలను అందించాడు.  టీమ్ ఇండియాకు  క అందని ద్రాక్షల ఉన్న రెండు ప్రపంచకప్ లను  అందించిన ఒక మహొన్నత  కెప్టెన్ ధోని . ఇక మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనురెప్పల కాలంలో వికెట్ల వెనుక ఉండి... కీలక వికెట్లు తీస్తూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. అందుకే మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపింగ్ అంటే క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతో ఫేవరెట్ గా ఉంటుంది. అయితే మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపింగ్ విషయంలో మొదట్లో ఎంతో ఇబ్బంది పడేవాడట. 

 

 

 ఈ విషయాన్ని టీమిండియా మాజీ వికెట్ కీపర్  కిరణ్ మోర్  వెల్లడించారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ ఆరంభంలో ఓ సమస్య ఎంతగానో బాధ పెట్టింది అంటూ తెలిపాడు. 2004 లో భారత క్రికెట్ జట్టు లోకి అరంగేట్రం చేసిన మహేంద్రసింగ్ ధోని... తొలుత జట్టులో పవర్ హిట్టర్ గా  త్వరగా వెలుగులోకి వచ్చి ఎంతో క్రేజ్ సంపాదించాడు. తన ఫినిషింగ్ స్కిల్స్ తో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. అయితే కెరీర్ ఆరంభంలో ఫినిషర్ గా  నిరూపించుకున్న మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపింగ్ విషయంలో మాత్రం ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు కిరణ్ మోర్ . వన్డే మ్యాచుల్లో వికెట్ కీపింగ్ పర్వాలేదు అనిపించినప్పటికీ టెస్టుల్లో మాత్రం పేలవ  ప్రదర్శన చేసే వాడు అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 

 అయితే తక్కువ సమయంలోనే తన వికెట్ కీపింగ్ లో ఉన్న బలహీనతలను గుర్తించిన  ధోని ... వాటిని అధిగమించి గొప్ప వికెట్ కీపర్ గా మారడానికి ఎంతో శ్రమించినట్లు చెప్పుకొచ్చాడు. ధోని ఎంత ప్రతిభావంతుడో  ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరికీ తెలుసు కానీ మొదట్లో అతని వికెట్ కీపింగ్ విషయంలో కొంత మంది సందేహం వ్యక్తం చేశారు. అయితే ధోని కొన్ని కొన్ని సార్లు పేలవ ప్రదర్శన చేసినప్పటికీ టీమ్ ఇండియా మేనేజ్మెంట్ కూడా అతనికి వరుస అవకాశాలు ఇవ్వడం తో తన సత్తా ఎంటో  నిరూపించుకొని ప్రస్తుతం భారత క్రికెట్ లో గొప్ప ఆటగాడిగా ప్రస్థానం  కొనసాగించాడు అంటూ భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోర్  వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: