సాధారణం గా ఫుట్బాల్ ఆట కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.  ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులు ఫుట్బాల్ లీగ్ లు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫుట్బాల్ గేమ్ అనగానే.. వందల కోట్ల టర్నోవర్ తో  బిజినెస్ జరుగుతూ ఉంటుంది.   ఫుట్బాల్ లీగ్ నిర్వహించడానికి పెద్ద పెద్ద కంపెనీలు వందల కోట్ల వెచ్చిస్తూ ఉంటాయి.



 అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆదరణ పొందిన ఆటగా ఫుట్బాల్ ప్రస్తుతం కొనసాగుతోంది.  అయితే ఫుట్బాల్ ఆటలో క్రిస్టియన్ రోనాల్డో ప్రస్తుతం దిగ్గజ ఆటగాడి గా కొనసాగుతున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎప్పుడూ జట్టుకు విజయం అందిస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే  క్రిస్టియన్ రోనాల్డో చేసిన చిన్న వేల కోట్ల నష్టాన్ని తీసుకు వచ్చింది.  అతను చేసిన చిన్న పొరపాటు ఇంతటి నష్టాన్ని తీసుకొస్తుందని అతను కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ క్రిస్టియన్ రోనాల్డో చేసిన పనికి 30 వేల కోట్లు నష్టం వాటిల్లింది.



 ప్రస్తుతం యూరో కప్ ఫుట్బాల్ లీగ్ జరుగుతుంది. ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ ఫుట్బాల్ లీగ్ ని ప్రేక్షకులు కోట్ల సంఖ్యలో వీక్షిస్తున్నారు.  ఈ ఫుట్బాల్ లీగ్ ని కోకా కోలా కంపెనీ స్పాన్సర్ చేస్తుంది.  ఇకపోతే క్రిస్టియన్ రోనాల్డో ప్రెస్ మీట్ కి హాజరైన సమయంలో తన ముందు ఉన్న కోకో కోలా బాటిల్ ని పక్కకు నెట్టాడు.  ఇక అంతే క్రిస్టియన్ రోనాల్డో చేసిన ఈ చిన్న పనికి 30 వేల కోట్లు నష్టం వాటిల్లింది. స్టాక్ మార్కెట్లో కొక కోలా షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి.  దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా క్రిస్టియానో రోనాల్డో.. ఇప్పటివరకు చాలా ప్రకటనలో నటించాడు.  కానీ కూల్ డ్రింక్  కి సంబంధించిన ప్రకటనల్లో మాత్రం నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: