టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీఫైనల్కు వెళ్తుందా లేదా అన్న దానిపైనే ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు టీమిండియా నాలుగు మ్యాచ్ లు ఆడింది. అయితే మొదటి రెండు మ్యాచ్ లలో  చిత్తుగా ఓడిపోయిన టీమిండియా ఇక తర్వాత రెండు మ్యాచ్ల్లో మాత్రం అద్భుతంగా పుంజుకుని  భారీ తేడాతో ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించింది. అయితే గ్రూప్ 2 లో భాగంగా ఇప్పటికే పాకిస్థాన్ జట్టు నాలుగు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించి సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.



 ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ తర్వాత సెమీ ఫైనల్కు అర్హత సాధించి రెండవ జట్టు ఏది అన్న దానిపై మాత్రం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఇలా సెమీఫైనల్లో ఛాన్స్ దక్కించుకోవడానికి ఏకంగా మూడు జట్లుహోరా హోరీ గా పోటీ పడుతున్నాయి అనే చెప్పాలి. ఓవైపు న్యూజిలాండ్ మరోవైపు  ఆఫ్ఘనిస్తాన్ ఇంకోవైపు టీమిండియా జట్లు ఇక సెమీఫైనల్లో రెండవ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రస్తుతం సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ మూడు జట్లలో ఎవరు రెండవ స్థానాన్ని దక్కించుకుని సెమీఫైనల్కు చేరుకుంటారు అన్నది  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 కాగా ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మధ్య రేపు మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో ఒకవేళ న్యూజిలాండ్ గెలిచింది అంటే ఇక నేరుగా సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. అసలు న్యూజిలాండ్కు ఎక్కడ పోటీ లేదు అని చెప్పాలి. అదే సమయంలో ఆప్ఘనిస్తాన్ గెలిస్తే టీమిండియాకు సెమీఫైనల్లో అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది. అయితే న్యూజిలాండ్ తో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించినప్పటికీ ఇక సెమీఫైనల్కు   వెళ్లడం అనేది టీమిండియా ప్రదర్శన పైనే ఆధారపడి ఉంటుంది. ఒక వేళ నమీబియా పై అటు భారత జట్టు గెలవక పోతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ జుట్టు సెమీఫైనల్కు చేరుకునే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: