క్రికెట్ లో మూడు రకాల ఫార్మాట్ లు ఉన్నాయి. వన్డే,టెస్ట్,  టి 20 క్రికెట్ అంటూ మూడు ఫార్మట్ లు ఉన్నప్పటికీ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎక్కువగా ఇష్టపడేది మాత్రం టీ20 ఫార్మాట్. ఎందుకంటే ఏ ఫార్మాట్లో లేనంతగా క్రికెట్ మజా కేవలం టి20 ఫార్మాట్ లోనే ఉంటుంది.. తక్కువ సమయంలో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక్కసారి బ్యాట్ మెన్ మైదానంలోకి దిగాడు అంటే చాలు  మొదటి బంతి నుంచి భారీగా సిక్సర్లు ఫోర్లు బాధటానికి  ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. అంతేకాదు అటు బౌలర్లు కూడా ఉన్న తక్కువ సమయంలోనే వైవిధ్యమైన బంతులు సంధించి వికెట్ పడగొట్టడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.


 అయితే సాధారణంగానే టి 20 మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ  ఉంటారు.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే మ్యాచ్ ని కన్నార్పకుండా వీక్షిస్తూ ఉంటారు. సాధారణ మ్యాచ్ జరిగితే ఇలా ఉంటే ఇక అటు టి20 వరల్డ్ కప్ జరిగితే ప్రేక్షకుల్లో ఉత్కంఠ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇక ప్రేక్షకులు అందరూ ప్రస్తుతం ప్రతి రోజూ అదే ఉత్కంఠభరితమైన మ్యాచ్ వీక్షిస్తున్నారు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న  ప్రతి మ్యాచ్ కూడా ఎంతో రసవత్తరంగా మారిపోయింది. ఇప్పటికే సెమీఫైనల్లో కొన్ని జట్లు సెమీఫైనల్లో బెర్త్  సంపాదించుకున్నాయి. అయితే నిన్నటి వరకు కొన్ని జట్లు సెమీఫైనల్ అవకాశం కోసం హోరాహోరీ పోరాటం సాగించాయి.



 ప్రతి బ్యాట్స్మెన్ కూడా భారీ సిక్సర్లు కొట్టి జట్టుకు విజయం అందించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు ఎంతో మంది ఆటగాళ్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు అన్న విషయం తెలిసిందే . ఇప్పటివరకు ఎన్నో మ్యాచ్లు జరిగినప్పటికీ నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం టి20 వరల్డ్ కప్ లో ఒక అరుదైన రికార్డు నమోదయింది. నిన్న జరిగిన మ్యాచ్లో టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ అరుదైన ఘనతను సాధించాడు. జరిగిన అన్ని మ్యాచ్ లలో కంటే బిగ్గెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 111 మీటర్ల సిక్సర్  కొట్టాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అత్యధిక దూరం సిక్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా 7 బంతుల్లో 18 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: