ప్రస్తుతం ఇండియా జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా మూడు టెస్ట్ లు మరియు మూడు వన్ డే ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా మొదటి టెస్ట్ లో ఇండియా విజయకేతనం ఎగురవేయగా రెండవ టెస్ట్ ఇంకా జరుగుతోంది. రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో కీలక సమయంలో ఇండియాను ఆదుకున్నా మూడవ టెస్ట్ జట్టులో స్థానం దక్కేలా కనిపించడం లేదు. ఈ మధ్య వరుస సిరీస్ లలో భారత సీనియర్ ప్లేయర్లుగా ఉన్న ఛతేశ్వర్ పూజారా మరియు అజింక్యా రహానేలు వరుసగా విఫలం అవుతూ వస్తున్నారు. అయితే సెలక్షన్ కమిటీ సైతం సీనియర్ లు కదా అని ఇంత కాలం అవకాశాలు ఇస్తూ వచ్చారు.

కానీ నేడు సోషల్ మీడియా వలన సెలెక్టర్ల దాకా ఎందుకు ప్రేక్షకులే టీమ్ లో ఎవరు ఉండాలి ఎవరిని పక్కన పెట్టాలి అనే విషయం నిర్ణయిస్తున్నారు. అయితే మెజారిటీ ప్లేయర్లు ఇలా అంటుంటే దానికి విరుద్ధంగా సెలక్షన్ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా వారిపై కూడా ట్రోలింగ్ తప్పడం లేదు. అందుకే వీరిద్దరి పైన వేటు వేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్దపడుతుందని వార్తలు వస్తున్నాయి. కీలకమైన స్థానాల్లో బ్యాటింగ్ కి దిగుతున్న వీరిద్దరి పైనే జట్టు స్కోర్ ఆధారపడి ఉంటుంది. అయితే వీరు ఫెయిల్ అయితే, అడపా దడపా లోయర్ ఆర్డర్ ఏమైనా పరుగులు చేస్తే తప్పించి జట్టంతా పేక మేడలా కూలిపోతున్నారు.

ఇప్పుడు ఇండియన్ జట్టు లోకి రావడానికి యువ రక్తం సిద్ధంగా ఉంది. ఇప్పటికే వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్ బెంచ్ కే పరిమితం అయ్యాడు. మరియు ఎంతో టాలెంట్ ఉన్న హనుమ విహరికి తగినన్ని అవకాశాలు రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ మూడవ టెస్ట్ టీం ఎంపిక ప్రక్రియలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: