సాధారణంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్ళ మధ్య వాగ్వాదం జరగడం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఒకరితో ఒకరు కవ్వింపు లకు దిగడం  కూడా చేస్తూ ఉంటారు. ఇక మైదానంలో ఎప్పుడు అగ్రసివ్ గా ఉంటూ చిన్న తప్పు జరిగినా కూడా అగ్రిసివ్ గానే స్పందించే విరాట్ కోహ్లీ అయితే మైదానంలో ఎప్పుడూ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడంతో లాంటివి చూస్తూ ఉంటాం. ఇకపోతే మొన్నటివరకు విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా లోని మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగాడు. కానీ మొన్నటి వరకూ పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీ కేవలం టెస్టు కెప్టెన్గా మాత్రమే కొనసాగాడు. కానీ ఇటీవల టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది షాకిచ్చాడు విరాట్ కోహ్లీ.



కాగా ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం కేవలం ఒక సాదా సీదా ఆటగాడు గానే కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరిగింది. మొదటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 31 పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించడం గమనార్హం. అయితే అంతకు ముందు ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 36 ఓవర్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా భారత ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు తెలుస్తోంది.



 దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. 36 ఓవర్లో నాలుగో బంతిని సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా షార్ట్ కవర్ రీజియన్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అది నేరుగా విరాట్ కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఇక కీపర్ చేతుల్లోకి బంతి విసిరే క్రమంలో విరాట్ కోహ్లీ బలంగా విసరగా ఆ బంతి  బావుమాకు తగిలింది. కానీ గాయం మాత్రం కాలేదు. ఈ క్రమంలోనే కాస్త అసహనానికి లోనైనా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా.. నేను క్రీజు లోనే ఉన్నాను అలాంటి  త్రో అవసరం లేదు అంటూ కామెంట్ చేశాడు. దీంతో కోపం పట్టలేకపోయిన విరాట్ కోహ్లీ నేను కావాలని నిన్ను కొట్టాలి అనుకోలేదు కీపర్ కు వేసే క్రమంలో పొరపాటున తగిలి ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి అంటూ వాగ్వాదానికి దిగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: