ఇక అదే సమయంలో కెప్టెన్సీ మార్పు వివాదంగా మారడం ఈ వార్తలకు బలాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. అయితే ఎన్నో ఏళ్ల పాటు టీమ్ ఇండియా కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు ఒక సాదా సీదా క్రికెటర్ గానే కొనసాగుతున్నాడు.. ఇలాంటి సమయంలో మొదటి సారి రోహిత్ శర్మ కెప్టెన్సీ లో విరాట్ కోహ్లీ ఎలా వ్యవహరిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఇటీవలే టీమ్ ఇండియా ఆడిన ప్రతిష్ఠాత్మకమైన 1000వ మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొదటి మ్యాచ్ ఆడాడు విరాట్ కోహ్లీ. ఎక్కడ ఈగోకు పోకుండా మునుపటి లాగానే కనిపించాడు.
ఈ క్రమంలోనే ఇక ఇటీవల జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక సలహాలు రోహిత్ శర్మ పాటించాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 22 ఓవర్లో యుజ్వేంద్ర చాహల్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ బ్యాట్ అంచుకు తాకుతూ కీపర్ పంత్ చేతిలో పడింది. కాగా టీమిండియా అప్పీల్ చేసినప్పటికీ నాటౌట్గా ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్. ఈ క్రమంలోనే వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. రోహిత్ బంతి బ్యాట్ను తాకింది.. తర్వాత పాడ్ లను తాకింది నేను శబ్దం స్పష్టంగా వీన్నాను అంటూ చెప్పడంతో ఇక రోహిత్ కోహ్లీ మీద నమ్మకంతో డిఆర్ఎస్ కు వెళ్ళాడు రోహిత్. చివరికి వికెట్ దక్కింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి