కాగా టోర్నీకి ఒక్క రోజు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి షాక్ తగిలింది అని చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన 11 వరల్డ్ కప్ లలో ఆరు సార్లు టైటిల్ నెగ్గిన చరిత్ర ఆస్ట్రేలియా కు ఉంది. ఇప్పుడు ఏడవసారి టైటిల్ కొట్టాలని అన్ని విధాలుగా సమాయత్తం అయింది. కానీ సమరానికి ఒక్క రోజు ముందు ఆస్ట్రేలియా అల్ రౌండర్ యాష్లే గార్డెనర్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇటీవల ఆస్ట్రేలియా విజయాలలో కీలక భూమిక పోషిస్తున్న గార్డెనర్ కు కోవిడ్ సోకడంతో ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం నిరాశకు లోనయింది. ఈమెకు స్వల్ప లక్షణాలు ఉండడంతో నిన్న జరిపిన టెస్ట్ లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీనితో గార్డెనర్ ను మరో 10 రోజుల వరకు ఐసోలేషన్ లోనే ఉంచనున్నారు. దీనితో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లకు గార్డెనర్ మిస్ అవనుంది. ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇందులో సంతోషపడే విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా టీమ్ లో ఇంకెవరికీ కోవిడ్ పాజిటివ్ కాకపోవడమే. మిగిలిన అందరికీ కూడా టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ గా తేలింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి