మొన్నటి వరకూ ఐపీఎల్లో కె.ఎల్.రాహుల్ అనగానే అందరూ పంజాబ్ కింగ్స్ జట్టు గుర్తుకు వచ్చేది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా జట్టుకు ఎంతగానో సేవలు అందించాడు కేఎల్ రాహుల్. జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ కూడా చేతులెత్తేసిన ఎప్పుడు ఒంటరి పోరాటం చేస్తూ విజయాన్ని అందించేందుకు అనుక్షణం పరితపిస్తూ ఉండేవాడు.  కానీ ఇటీవల జరిగిన మెగా వేలంలో పంజాబ్ కింగ్స్  నుంచి తప్పుకొని కొత్తగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న లక్నో సూపర్ జెంట్స్ జట్టులోకి వెళ్ళిపోయాడు. అయితే ఇక జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ కూడా అప్పగించింది.


 ఈ క్రమంలోనే తన ప్రయాణాన్ని సరికొత్తగా ప్రారంభించాలి అనే ఉద్దేశంతోనే తాను పంజాబ్ కింగ్స్ జట్టు ను వీడి లక్నో జట్టులోకి వచ్చాను అంటూ వివరణ కూడా ఇచ్చాడు కేఎల్ రాహుల్. ఈసారి కేఎల్ రాహుల్ తన కెప్టెన్సీ తో  అదరగొడతాడా అని అభిమానులు అందరూ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు కేఎల్ రాహుల్. ఐపీఎల్ లో విజయం కావాలి అంటే మిడిలార్డర్లో సత్తా చాట గల ఆటగాళ్లకు జట్టులో ఉండాలని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.  ఇలా మిడిలార్డర్లో బలమైన ఆటగాళ్లు ఉన్నప్పుడే ఇక ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు.



 ఐపీఎల్లో చేసిన పరుగులను పరిగణలోకి తీసుకున్నంత కాలం నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గత మూడు నాలుగు సీజన్లలో నేను మెరుగైన ప్రదర్శన చేస్తాను.  అయితే జట్టు విజయవంతం కావాలంటే మిడిలార్డర్లో బాగా రాణించగల ఆటగాళ్లు ఉండాలి. ఇటీవల జరిగిన మెగా వేలంలో మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా లాంటి మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాం. దీంతో మిడిల్ లోయర్ ఆర్డర్ కూడా బలంగా ఉంది. కాగా పరిస్థితులను బట్టి నిలకడగా రాణించాలి కెప్టెన్గా నేర్చుకున్న పాఠాల్లో ఇది ఒకటి అంటూ లక్నో కెప్టెన్ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు.ఇక ఈ జట్టు ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ మార్చి 28 వ తేదీన గుజరాత్ టైటాన్ తో ఆడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: