నిన్న ఐపిఎల్ లో భాగంగా 21 వ మ్యాచ్ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం లో గుజరాత్ టైటాన్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఐపిఎల్ లో తొలిసారి అడుగు పెట్టిన గుజరాత్ నిన్నటి వరకు జరిగిన 3 మ్యాచ్ లలో ప్రత్యర్ధులను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంది. అయితే నిన్న ఈ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఎంతో పటిష్ఠమైన గుజరాత్ ను సన్ రైజర్స్ అలవోకగా ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓడిన తీరును చూస్తుంటే ఒకరకంగా కెప్టెన్ హర్ధిక్ పాండ్య కారణం అని తెలుస్తోంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు లాస్ట్ మ్యాచ్ హీరో గిల్ శుభారంభం అందించలేకపోయాడు.

ఇక మొదటి నుండి ఇబ్బంది పడుతున్న మరో ఓపెనర్ వేడ్ సైతం మరో అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. అయితే ఎక్కడా కూడా రన్ రేట్ డ్రాప్ అవ్వలేదు. 47 పరుగుల వద్ద 2 వ వికెట్ కోల్పోయిన సమయంలో కెప్టెన్ హర్దిక్ పాండ్య క్రీజులోకి వచ్చాడు. అయితే దూకుడుకు మరియు భారీ హిట్టింగ్ కు మారు పేరైన హార్దిక్ పాండ్య ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. అయితే దీనికి కారణం వికెట్లు పడిపోవడం మరియు సన్ రైజర్స్ బౌలర్లు చెలరేగడంతో నెమ్మదిగా ఆడాడు అనుకుంటే, ఆఖరి మూడు ఓవర్లలో సైతం హార్ధిక్ బ్యాట్ జులిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా హార్దిక్ లాస్ట్ 5 ఓవర్ లలో తాను ఆడిన 11 బంతులలో ఒక్క బౌండరీ కూడా లేదు.

దీనిని బట్టి హార్దిక్ టీమ్ కోసం ఆడుతున్నాడా ? లేదా టీమ్ ఇండియాలో తన స్థానాన్ని మళ్లీ చేజిక్కించుకోవడానికి ఆడుతున్నాడా ? అన్నది ఇటు అభిమానులకు మరియు టీమ్ యాజమాన్యానికి అర్థం కాలేదు. ఒకవేళ హర్థిక్ ఆఖరి ఓవర్లలో మరో 20 పరుగులు చేసి ఉంటే జట్టు ఫలితం మారి ఉండేది. ఇక బౌలర్ల వైఫల్యం కూడా కారణం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: