ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ హిస్టరీ లోనే ఎన్నడూ లేని రికార్డులను కొల్లగొడుతూ వరుస విజయాలతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఏకంగా ఎనిమిది విజయాలతో ఐపీఎల్లో మునుపెన్నడూ లేని రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇలా వరుస విజయాలతో తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇటీవల జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ షాక్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ లో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసింది గుజరాత్ టైటాన్స్ జట్టు. కాగా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 144 పరుగులకే పరిమితమైంది.
దీంతో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు బ్యాట్స్మెన్ లు అదరగొట్టారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 62 పరుగులతో మంచి ఆరంభం చేయగా..మరో ఓపెనర్ బెయిర్ స్ట్రో మాత్రం విఫలం అయ్యాడు. తరువాత వచ్చిన రాజకప్ప 40 ఆఖరి ఓవర్లో లివింగ్ స్టోన్ 30 పరుగులతో మెప్పించాడు. దీంతో మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ జట్టు ఎంతో అలవోకగా విజయం సాధించింది. ఇలా టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న గుజరాత్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి