ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఒకే విషయం గురించి చర్చ జరుగుతోంది. అదే జస్ప్రిత్ బూమ్రా బ్యాటింగ్ ప్రదర్శన గురించి. అయితే బుమ్రా ప్రదర్శన గురించి ప్రపంచ క్రికెట్లో చర్చించుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఇన్ని రోజుల వరకు కేవలంబౌలింగ్ ప్రదర్శన గురిం చిమాట్లాడుకునే వారు. కానీ మొదటిసారి అతని బ్యాటింగ్ గురించి మాట్లాడు కోవడమే కాదు అతని పై ప్రశంసలు కురిపించకుండా లేకపోతున్నారు. కేవలం టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ లకు మాత్రమే పరిమితమైన ఒకే ఓవర్లో ఎక్కువ పరుగుల రికార్డును ఇటీవల జస్ప్రిత్ బూమ్రా సాధించాడు.


 ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న కీలకమైన టెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు బుమ్రా.  అయితే ఇటీవలే బుమ్రా మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు.  ఏకంగా ఒకే ఓవర్లో 29 పరుగులు చేశాడు. బుమ్రా బ్యాటింగ్తో ఆశ్చర్యపోయిన స్టువర్ట్ బ్రాడ్ ఒత్తిడిలో ఏకంగా అయిదు వైడ్ బాల్స్ వేసాడు. దీంతో అదనంగా ఐదు పరుగులు కూడా వచ్చాయి.


 ఈ క్రమంలోనే మొత్తంగా ఒకే ఓవర్లో 35 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే గతంలో యువరాజ్ సింగ్ రికార్డు ఒకటి ప్రస్తుతం తెరమీదికి వచ్చింది. 2005లో ఇంగ్లండ్తో జరిగిన టీ-20 మ్యాచ్లో భాగంగా యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లోఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు బుమ్రా కూడా ఒకే ఓవర్లో 29 పరుగులు చేసాడు. ఎక్స్ ట్రాలతో కలిపి 35 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.. అయితే ఈ రెండు సందర్భాల్లో ఇద్దరికీ బౌలింగ్ చేసింది స్టువర్ట్ బ్రాడ్  కావడం గమనార్హం. దీంతో ఇక దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. పాపం స్టువర్ట్ బ్రాడ్ ఇక ఇండియన్ బ్యాట్స్ మెన్  చేతిలోనే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..

మరింత సమాచారం తెలుసుకోండి: