క్రికెట్ లో ఎన్ని ఫార్మాట్ లు ఉన్న అటు ఎక్కువ మంది క్రికెటర్లు ఇష్టపడేది మాత్రం టెస్టు ఫార్మాట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే టెస్టు ఫార్మాట్లో ఆడటం కారణంగా ఇక ప్రతీ ఆటగాడికి ప్రతిభకు ఒక సవాల్ ఎదురవుతూ ఉంటుంది. ఆ సవాలును ఎదుర్కొని అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రతి ఒక క్రికెటర్ కూడా ఇష్ట పడుతూ ఉంటాడు అనిచెప్పాలి. ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్క క్రికెటర్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేకాదు సుదీర్ఘమైన ఫార్మాట్లో ఎక్కువ కాలం కొనసాగాలి అని భావిస్తూ ఉంటారు. అయితే టెస్టు ఫార్మాట్లో  ఎక్కువ కాలం కొనసాగడం అంత సులభమైన విషయమేమీ కాదు.. శారీరకంగా మానసికంగా ఎంతోఫిట్ గా ఉండాల్సి ఉంటుంది.


 ఎందుకంటే సుదీర్ఘమైన ఫార్మాట్ లో ఎక్కువ సేపు మైదానంలో క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత తో పాటు అటు శారీరకమైన ఫిట్నెస్ కూడా ఎంతో అవసరం అని చెప్పాలి. అందుకే అటు టెస్టు ఫార్మాట్లో ఎక్కువ రోజులు కొనసాగె ఆటగాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. అంతే కాదు  టెస్ట్ ఫార్మాట్లోనూ అరుదైన  మైలురాయిని అందుకోవడం అంటే అది అరుదైన విషయమని చెప్పాలి. ఇటీవల శ్రీలంక క్రికెటర్ ఇలాంటి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. 100 టెస్టులు ఆడిన ఆరో క్రికెటర్గా అరుదైన రికార్డు సృష్టించాడు.



 ఇలా శ్రీలంక జట్టు తరఫున వంద టెస్టుల్లో మైలురాయిని అందుకున్న ఆటగాడు ఎవరో కాదు ఏంజెలో మాథ్యూస్. ఇటీవలే ఈ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంక జట్టు తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ళ లిస్టులో చేరిపోయి అరుదైన  రికార్డు సాధించాడు అనే చెప్పాలి. పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ద్వారా ఈ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ జయవర్ధనే 149 టెస్టులు, మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 134 టెస్టులు, మురళీధరన్ 133, చమిందా వాస్  111 టెస్టులు, జై సూర్య 110 టెస్ట్ లు  మాత్రమే ఆ దేశం తరఫున వంద టెస్టులు ఆడిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు ఏంజెలో మాథ్యూస్ ఈ అరుదైన రికార్డు సాధించి ప్రేక్షకులను ఆనందంలో ముంచేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: