గత కొంత కాలం నుంచి మంచి ఫాంలో కొనసాగుతున్న రోహిత్ శర్మ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ భారీ స్కోర్లు చేస్తూనే మరోవైపు కెప్టెన్‌గా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ అదరగొడుతున్నాడు రోహిత్. ఈ క్రమంలోనే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో భాగంగా రోహిత్ శర్మ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ సమయంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ టీ20 సిరీస్ లో అందుబాటులోకి వచ్చాడు.


 టీ20 సిరీస్ లో భాగంగా మరోసారి తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేశాడు అనే విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టి-20 సిరీస్ లో భాగంగా 3 మ్యాచ్ లు గెలిచిన ఇండియా టి20 సిరీస్ లో విజయం సాధించింది అని చెప్పాలి. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లో విజయం సాధించింది టీమిండియా ఈ క్రమంలోనే టీమిండియా. కాగా భారత జట్టు ప్రదర్శనపై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అనే చెప్పాలి. అయితే వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టి20 మ్యాచ్ లో ఇటీవలే రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా  రెండవ స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ.


ఈ రికార్డు మాత్రమే కాకుండా మరో అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నారు అని తెలుస్తోంది.  రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని అందుకోవడం పట్ల అభిమానులు అందరూ కూడా ఎంతో ఆనందంలో మునిగిపోయారు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగవ టి20 మ్యాచ్ 33 పరుగులు చేశాడు రోహిత్ శర్మ.. తద్వారా తన అంతర్జాతీయ క్రికెట్ లో 16000 పరుగులు పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన ఏడవ భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలి, రాహుల్ ద్రవిడ్, మహేంద్రసింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ ఈ మైలురాయిని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: